శతాబ్దాల
చరిత్ర గల ఆ పురాతన
ఆలయం కొలనుపాక లోని వీర శైవ
క్షేత్రము. నల్గొండ జిల్లా ఆలేరు నుంచి 6 కిలోమీటర్ల
దూరంలో ఉన్న ఈ ఆలయం
ఎంతో ప్రాచీనమైనదట. హైదరాబాద్ నుంచి మొత్తంగా 80 కిలోమీటర్ల
దూరంలో ఉంది.
ఈ ఆలయ స్థల పురాణం చాలా పురాతనమైనదే. దాదాపు 11వ శతాబ్దంలో నిర్మితమైందని చరిత్రకారులు చెబుతున్నారు. 1070 నుంచి 1126వ సంవత్సరం మధ్యలో ఈ ఆలయం ఓ వెలుగు వెలిగింది. చాళుక్య రాజులు నిర్మించిన ఈ గుడి ఆర్కిటెక్చర్ నేటికి అబ్బురపరుస్తుంది. సోమేశ్వర లింగముగా స్యయంభు వెలిసిన శివలింగం దగ్గర ఈ ఆలయం నిర్మించారు. శక్తి మాత చండికాంబ ఆలయం కూడా ఇక్కడ ఉంది. వీర శైవ ధర్మ సంస్థాపనం ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. చంద్రుడు తన శాప విముక్తి కోసం సోమేశ్వర లింగంగా కొలువైన శివుడిని ఇక్కడే పూజించాడట. ఇక్కడ పూజించాకే చంద్రుడి శాప విమోచనం అయిందట. అవతరా పురుషుడు రాముడు, నారదుడు, అగస్త్య మహా ముని లాంటి ఎందరో మహనీయులు ఈ ఆలయంలో శివుడ్ని పూజించారట. ఇక్కడ ఉన్న శిలలే అందుకు సాక్ష్యం.

ఈ గుడి ప్రత్యేకతలు వర్ణించలేము.
చాళుక్యుల నిర్మాణ శైలి మన కళ్లను
కట్టిపడేస్తుందట. కాకతీయులు నిర్మించిన మహా ద్వారం గుడికి
స్పెషల్ అట్రాక్షన్. మహా ద్వారానికి ఒక
వైపు గణేశుడు, మరో వైపు నంది
విగ్రహాలున్నాయి. ఇక్కడి ధ్వజస్తంభము ఎంతో ప్రత్యేకంగా ఉంది.
నిట్టనిలువుగా నిలుచున్న హనుమంతుడు ధ్వజస్తంభంపై కింద ఉంటే, శిఖరం
పైన నంది కొలువున్నాడు. హనుమంతుడికి
ఇరువైపుల సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరుడి విగ్రహాలున్నాయి. ఈ మెయిన్ ఎంట్రన్స్
నుండి సెకండ్ సెగ్మెంట్కు వెళ్లే క్యారిడార్లో రెండు వైపులా
అందమైన దేవుళ్ల శిల్పాలు అబ్బుపరుస్తాయి.
ఇక్కడ కొలువైన లింగాన్ని నయ లింగ అని భక్తులు పిలుస్తారు. ఈ లింగాన్ని స్పర్శించి భక్తితో ఏదైనా కోరితే నిజమౌతుందని భక్తుల నమ్మకం. ఇక సెకండ్ సెగ్మెంట్ ద్వారానికి ఇరువైపులా వీరభద్ర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ లింగేశ్వరుడి ముందు ఓ భారీ నంది విగ్రహం ఉంది. భవిష్య నందిగా పేరుగాంచింది.
ఇక మూడో సెగ్మెంట్ నవరంగ మండపం. ఇదే సోమేశ్వర స్వామిగా ఆ పరమశివుడు కొలువై ఉన్న గర్భగుడి. దీని వెనుక భాగంలో శ్రీ జగద్గురు రేణుకాచార్య లింగోద్భవ మూర్తి కూడా ఉంది. స్వామి వారి గర్బగుడికి ఆనుకొని చండికాంబ సన్నిధి ఉంది. దీని పక్కనే కోటి లింగం ఆలయం కూడా ఉంది. ఇక్కడ లింగ విగ్రహంపై మరో 1001 చిన్న లింగాలు చెక్కబడి ఉన్నాయి. ఈ లింగానికి ప్రదక్షిన చేస్తే కోటి లింగాలకు ప్రదక్షణ చేసినంత పూజా ఫలం దక్కుతుందని నమ్మకం.

అయితే ఇంత ప్రశస్తి గాంచిన ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. అయినా సరే ఇక్కడికి వెళితే ఏదో వింత అనుభూతి కలుగుతుందట. ఇక్కడి పరిసరాల్లో మానసిక ప్రశాంతత గోచరిస్తుంది. మునులు తపస్సు చేసిన నేల కదా అందుకే అలా ఉంటుందేమో. ఇక మరో లింగాలయం గబ్బిలాలతో భయంకరంగా ఉంటుందట. లోపలికి వెళ్లే సాహసం ఎవ్వరూ చేయరట. నిత్య పూజలు ఆగిపోయే వేల సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ పూజారి, సెక్యూరిటీ ఎవరూ లేరట. వెళ్లినవాళ్లకు ధైర్యం ఉంటే చాలు. ఇక్కడే ఉన్న జైన ఆలయం ఎంతో ప్రాచుర్యం గాంచింది. కానీ ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ సోమేశ్వర ఆలయం మాత్రం ఎవరికీ తెలియదు.
No comments:
Post a Comment