Wednesday 3 September, 2014

అలోపీ శంకరీ(మహేశ్వరీ)” శక్తి పీఠం ( ALLAHABAD )

అలోపీ శంకరీ(మహేశ్వరీ)” శక్తి పీఠం (అలోపీ దేవి మందిర్) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో, అలహాబాద్ లోని పశ్చిమ దారాగంజ్ ప్రాతంలో, అలోపీ బాగ్ లో (సిటీ సెంటర్ నుండి 5 కిమీ) వుంది. శక్తి పీఠం పవిత్రత్రివేణి సంగమంకు (గంగా, యమున, సరస్వతీ) సమీపంలో ఉంది.
ఇక్కడ సతీ దేవి చేతివేళ్లు (హస్తాంగుళీలు) పడినవని చెపుతారు. ఆలయ గర్భగుడి లో ఒక పాలరాయి వేదిక పై ఒక చిన్ని చెక్క ఊయల(ఝూలా) నే దేవి రూపంగా పూజిస్తారు. ఊయలకే (ఝూలా) భక్తులు తమ మొక్కులు తీర్చుకొంటారు.
సతీ దేవి శరీరంలోని చివరి అవశేషాలు (భాగం) స్థలం వద్ద పడి, సతీ దేవి అదృశ్యం అయినందువలనఅలోపీ”(అదృశ్యం, కను మరుగైపోయిన ) ప్రదేశంగా పేరొందింది,.
అలోపీ దేవిఊయల(ఝూలా) రూపంను మీరు దర్శించుకొని తరించండి.!! శుభం భూయాత్.



No comments:

Post a Comment