Thursday, 11 September 2014

శ్రీ భద్రకాళీ(సావిత్రి) శక్తిపీఠం

శ్రీ భద్రకాళీ(సావిత్రి) శక్తిపీఠం భారతదేశంలో, హర్యానాలో(ఏకైక శక్తి పీఠం),(చండీగఢ్ నుండి 90కి.మి.,ఢిల్లీ నుండి160 కి.మీ.) కురుక్షేత్ర జిల్లాలో,కురుక్షేత్ర రైల్వే స్టేషన్ కు కి.మీ, పిపళి(Pipli) బస్సుస్టాండ్ నుండి 7 కి.మి. దూరంలో, థానేశ్వర్ (స్థానేశ్వర) పట్టణంలోని శ్రీ భద్రకాళీ దేవి ఆలయంలో వుంది. ఇక్కడ సతీ దేవి కుడి మడమ (Right Ankle) పడినదని చెపుతారు. శక్తి పీఠంను సావిత్రి పీఠం, కాళికా పీఠం, దేవి కూప్ (Devi Koop) ఆలయంగా కూడా పిలుస్తారు.
థానేశ్వర్ సమీపంలోని కురుక్షేత్ర పట్టణంలో గతించిన తమ పెద్దలకు పిండ దానాది క్రియలు ఆచరిస్తారు. ఇదే కాకుండా పట్టణంలోనే మహా బారత యుద్ధం జరిగింది. యుద్ధాన్నేకురుక్షేత్ర మహా సంగ్రామంగా పిలుస్తారు. పాండవులు యుద్ధానికి వెళ్ళే ముందు తమకు విజయం చేకూరాలని భద్రకాళీ దేవినే పూజించారని చరిత్ర కధనం. ఇక్కడే వున్న చారిత్రిక మఱ్ఱి వృక్ష ప్రదేశంలోనే శ్రీ కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసాడు

భద్రకాళీ దేవి ఆలయంలో భక్తులు తమ కోరికలు నెరవేరాలని, వాటిని పొందడం కోసం, మరల తమను మళ్ళీ ఇక్కడకు రమ్మని దీవించాలని, దేవికిమృత్తికతో చేసిన ఆశ్వ విగ్రహాల” (మట్టి టెర్రకోట గుర్రం)ను మందిరం హాలు మధ్యలో వున్నదేవీ పాదకమలం వద్ద మొక్కుబడిగా సమర్పించుకుంటారు. ఇదే హాలులో ఇంకా రాధ-కృష్ణులు, శ్రీ కృష్ణుని విశ్వరూపం, శ్రీ సీతా-రామచంద్రుల విగ్రహాలను ప్రతిష్టించారు. ఇది ఒకతప్పక చూడవలసినధార్మిక, చారిత్రక పవిత్ర ప్రదేశం.

శ్రీ భద్రకాళి అమ్మవారిని పరోక్ష దర్శనం చేసుకుని, దేవి కృపా కటాక్షణాలకు పాత్రులు కండి..!! శుభం భూయాత్



No comments:

Post a Comment