Monday, 26 May 2014

Shrunkala devi shaktipeeth.

SRI SHRUNKALA DEVI SHAKTHIPEETH ( BENGAL )


పవిత్రమైన ప్రదేశంలోనేశృంఖలా దేవిశక్తి పీఠం ఉండి ఉంటుందని అంతా బలంగా విశ్వసిస్తున్నారు. అమ్మవారిస్తనంపడిన ప్రదేశంగా చెప్పుకుంటోన్న శక్తి పీఠంలో, ఆమె శక్తినిఋష్య శృంగ మహర్షిస్థాపించిన కారణంగా పీఠానికి శృంగలా దేవి పీఠం అనే పేరు వచ్చిందని అంటారు. కాలక్రమంలో ఇదే శృంఖలా దేవి పీఠంగా మారింది.
శక్తి పీఠం పశ్చిమ బెంగాల్లోని గంగాసాగర్ ప్రాంతంలో వుందని తెలుస్తోంది. అయితే ఇక్కడ శక్తి పీఠానికి సంబంధించిన ఆనవాళ్లు లేవు. గంగోత్రిలో జన్మించిన గంగ ఉత్తరప్రదేశ్బీహార్ మీదుగా ప్రయాణం చేసి ఇక్కడి సాగరంలో కలుస్తుంది. కారణంగానే ప్రాంతానికి గంగాసాగర్ అనే పేరు వచ్చింది.

ఆది శంకరాచార్యుల వారు శారదాదేవిని మాహిష్మతీ నగరం నుంచి తీసుకువస్తోన్న క్రమంలో, ఇక్కడి శక్తి తరంగాలను గమనించి ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేసినట్టు చరిత్ర చెబుతోంది. గంగాసాగర సంగమం కావడంతో, ఇక్కడ ఎక్కువగా పితృ దేవతలకి ఆబ్దికాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడి అమ్మవారిని దర్శించడం వలన మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

No comments:

Post a Comment