Sunday, 24 August 2014

యుగాడ్య/జుగాడ్యా/జోగాడ్యా(భూతధాత్రి) శక్తి పీఠం

శ్రీ యుగాడ్య/జుగాడ్యా/జోగాడ్యా(భూతధాత్రి) శక్తి పీఠం ఇండియాలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం,బర్ధమాన్(వర్ధమాన్) జిల్లాలో మంగళ్ కోట్ పరిధిలో, నిగమ్ రైల్వేస్టేషన్ కు 4 K.m దూరంలో వున్న క్షీర్ గ్రామం(Kshirgram) లో వుంది.

దీనిలోని దేవినిజోగాడ్యా ఉమగా కూడా భక్తులు పిలుస్తారు. దేవినే రామాయణ కాలంలో, రావణుని చిన్న సోదరుడుఅహిరావణుడుపూజించినట్లు ఇక్కడ స్థల పురాణాల బట్టి తెలుస్తోంది.

ఇఏ ప్రదేశంలో సతీ దేవి కుడికాలి బొటనవేలు పడిందని చెపుతారు.

పురాణ కధ ప్రకారం రామ - రావణ యుద్ధం సమయంలో రామ, లక్ష్మణులను అహిరావణుడు తన పాతాళ రాజ్యానికి ఎత్తుకు పోతాడు. దీనిని గ్రహించిన హనుమంతుడు పాతాళం లోని అహిరావణుని రాజ్యానికి వెళ్లి, అతనిని వధించి రామ లక్ష్మణులను రక్షించి క్షేమంగా తీసుకుని వస్తూ, అహిరావణునిచే పూజలందు కొంటున్నజోగాడ్యా ఉమదేవిని తనతోపాటు తీసుకువస్తాడు. అలా హనుమ వెంట వచ్చిన దేవి క్షీర్ గ్రామం(Kshirgram) లో స్థిరపడుతుంది.

శక్తి పీఠం విశేషం ఏమిటంటే దేవి లోతైన క్షీర్ (Kshir) అనే పెద్ద తటాక(చెరువు)జలాలలో నివాసాన్ని కోరుకోరుకొని దానిలోనే నివస్తిస్తూ వుంటుంది. దేవి అభీష్టం మేరకు,ఆమె విగ్రహాన్ని,అదే ప్రదేశంలో సగం నీట మునిగిన ఆలయంలోనే ఉంచబడింది.
ఇటీవలే ఆలయాన్ని కొత్త హంగులతో పునరుద్ధరించారు. నీట మునిగిన దేవి విగ్రహాన్ని సంవత్సరంలో ఆరు రోజులు మాత్రమే బయటకు తీసి,పూజాది కార్యక్రమాలు నిర్వహించి, కేవలం రెండు రోజులు మాత్రమే (31stBaishakh, బెంగాలీ పంచాంగము మొదటి నెల,2 బెంగాళీ మాసం జ్యేష్టం 4th ) భక్తుల దర్శనార్ధం ప్రదర్శించ బడుతుంది. సందర్భంగా ఒక పెద్ద మేలా (జాతర) జరుగుతుంది.

కేవలం రెండు రోజులు మాత్రమే దర్శనమిచ్చే జోగాడ్యా దేవిని మీరూ పరోక్షంగా దర్శించుకొని ..తరించండి..!!శుభం భూయాత్.



No comments:

Post a Comment