Sunday 24 August, 2014

శ్రీ జయదుర్గ (వైద్యనాధ) శక్తి పీఠం

శ్రీ జయదుర్గ(జైదుర్గ) (వైద్యనాధ) శక్తిపీఠం ఇండియాలో ఝార్ఖండ్ రాష్ట్రంలో నందన్-త్రికూట పర్వతాల నడుమ,దట్టమైన అడవులతో,యమునాజూర్ఘరూలా నదుల పరీవాహక ప్రాంతంలో,దేవగిరి జిల్లా, దేవగిరి పట్టణంలోబైద్యనాథ్ (వైద్యనాధ్) దేవాలయ ప్రాంగణంలో, బైద్యనాద్ గుడి ఎదురుగాపార్వతీ దేవి ఆలయంగా పిల్వబడుతూ, వుంది.

బైద్యనాద్ ( వైద్యనాథ్) దేవాలయం మహాశివుని ముఖ్యమైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా కూడా భావించబడుతోందిఇక్కడ సతిదేవిని జైదుర్గగా,శివుని బైద్యనాథ/(వైద్యనాథ్)గా పూజిస్తారు. శక్తిపీఠంబైద్యనాథ్ ధామ్/బాబాధామ్గా కూడా ప్రసిద్ధిగాంచినది.

పురాణాల ప్రకారం సతిదేవి హృదయం (గుండె) ఇక్కడ పడిపోయింది. మహాశివుడు హృదయాన్ని ప్రదేశంలోనే దహనం చేసినందువల్ల జై దుర్గ శక్తి పీఠంనిచితాభూమిఅని కూడా అంటారు. హృదయం పడిన ప్రదేశం కాబట్టి దీనినేహృదయ పీఠంఅనికూడా అంటారు.

పార్వతిదేవి(జై దుర్గ) ఆలయాన్ని, ఆలయ పూజారి అయిన రత్నపాణి ఓజా 1701-1710A.D మధ్య నిర్మించారుఆలయానికి వున్న ఇత్తడి సింహద్వారాన్ని పంజియారా ఎస్టేట్ జమీందారు అయిన శాలిగ్రామ సింగ్ 1889 సం.లో చేయించాడు.

ఇతిహాసం ప్రకారం, “రావణాసురుడుశివుని గురించి అకుంఠిత తపస్సు చేసి,శివుని మెప్పించి, “ఆత్మలింగాన్నిభూలోకానికి తెస్తాడు. కాని శివుడిచ్చిన ఆత్మలింగంస్వభావంప్రకారంభూమిమీదఆలింగం ఎక్కడ పెడితే అక్కడస్థాపితంఅయి, అక్కడ నుండి తిరిగిఎత్త శక్యం కాదనిమహాశివుడు చెబుతాడు.ఇక దేవతలు, రావణాసురుడు శివుని ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి, విష్ణువును వేడుకొనగా, విష్ణువు తనమాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి, సంధ్య వార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు. విషయం

తెలుపుకొన్న నారదుడువినాయకునివద్దకు వెళ్ళి, రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం గ్రహించి,దానినిభూమి మీద పెట్టాలనికోరతాడు.వినాయకుడు నారదుడు కోరినట్లు,రావణాసురుడు సంధ్యవార్చుకొనే సమయానికిబ్రాహ్మణ వేషంలో” 

వెడతాడు. బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే,రావణాసురుడు తాను సంధ్యవార్చుకొనవలసిన సమయమైనందున, లింగాన్నిపట్టుకొనవలసిందిగా కోరుతాడు. అది విన్న వినాయకుడు,లింగంచాలా బరువుగా ఉంటే తాను ఎక్కువ సేపు మోయలేనని, మోయలేక పోయినప్పుడుమూడుసార్లు పిలుస్తానని, పిలుపుల లోగా రాకపోతే, లింగాన్ని భూమి పైన పెడతానని చెబుతాడు.

రావణాసురుడు సంధ్యవార్చు కోవడానికి అటు వెళ్ళగానే, గణపతి లింగాన్ని మోయలేక పోతున్నట్లు నటించి, వెంట వెంటనేమూడు సార్లుపిలుస్తాడు. సంధ్యవార్చు సమయంమధ్యలోఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే, వినాయకుడు లింగాన్ని భూమి మీద పెట్టేస్తాడు . ఆత్మలింగం భూమిలో పాతుకుపోతుంది.
దీనికి రావణాసురుడు దుఃఖితుడై మరల శివుని గురించి అకుంఠితమైన తప్పస్సు చేసి తన తొమ్మిది తలలను ఖండించుకొని మహాశివునికి అర్పణ చేస్తాడు. అతని పరమభక్తికి మెచ్చిన మహాశివుడు మహానందపడి వైద్యునిగా (బైద్య) తలలను అతకించి రావణుని మరల బ్రతికిస్తాడు. అందుచేత ఇక్కడ శివుడు బైద్యనాథ్ గా పిలవబడుతున్నాడు.ఇదే కధనం కొద్ది మార్పులతోగోకర్ణపుణ్యక్షేత్రంలో కూడా వివరించబడింది.

మరో పురాణకధనం ప్రకారం ఆలయాన్ని బైజు అనే ఒక పశువుల కాపరి కనుగొన్నాడని అతని పేరుపైనే ఆలయం బైద్యనాధ్ గా పిలవబడుతోందని తెలుస్తోంది. ఇక్కడ వున్న శివలింగము చుట్టూ వున్న ఎనిమిది కమలం రేకుల పైభాగం రావణుడు లింగాన్ని బలవంతంగా పెకలించ ప్రయత్నించినపుడు విరిగిపోయినట్లు చెపుతారు.
ఆలయ ప్రదేశం అన్ని జన్మాంతర, దీర్ఘవ్యాధులకు (ప్రత్యేకంగా కుష్టు) నివారణకు దివ్యమైన ఒక ఔషధమని భక్తులు నమ్ముతారు. అందువల్ల ఆలయ ప్రదేశం బైద్యనాథ్/వైద్యనాథ్/(మనో)కామన లింగంగా పిలవబడుతోంది. మత్స్య పురాణంలో దీనినిఆరోగ్య బైద్యనాథ్గా మహాశివుడు తన భక్తుల భవరోగాన్ని/ శారీరక అస్వస్థత లకు ఉపశమనాన్ని ప్రసాదించేదిగా పేర్కొనబడింది.

జైదుర్గ ఆలయం లోపల ఎడమవైపు బగళాముఖి, కుడి వైపున పార్వతిదేవి (జై దుర్గ) విగ్రహాలు వున్నాయి.. జై దుర్గా దేవిని రెండు రూపాలలో అంటే, ఒకటి వినాయకుడు కొలిచే త్రిపుర సుందరి/త్రిపుర భైరవిగా మరియు రావణుడు కొలిచే చిన్నమస్త దేవిగా పూజిస్తారు. దీనినే పార్వతి దేవాలయం అని కూడా అంటారు వీటికి భక్తులు పువ్వులు, పాలు అందించేందుకు గట్టు ఎక్కవలసి ఉంటుంది.

ఇక్కడ విశేషమేమంటే ఎరుపు రంగు పట్టు దారాలతో జై దుర్గా ఆలయ, బైద్యనాథ్ ఆలయ గోపురాలు కలుపుతూ మనకు దర్శన మిస్తాయి.ఇలా రెండు గోపురాలను ఒకే పట్టుదారంతో కలిపి జతచేసే భక్తులు శివ-పార్వతుల వలె అన్నోన్యంగా, సంతోషంగా జీవితం గడుపుతారని అని ఒక ప్రబలమైన నమ్మకం ఉంది.

అంతేకాకుండా, బైద్యనాథ్ ధాం ఒక ప్రముఖ సిద్ధపీఠం (తాంత్రిక సాధన స్థానం)గా ఉంది. అనేక మంది తాంత్రికులు తాంత్రిక సాధన కోసం జై దుర్గా దేవిని, బైద్యనాథ్ ని పూజిస్తారు. అక్కడ వున్న అగ్నిగుండం తాంత్రిక శక్తి సాధన కోసం ఎప్పుడూ రగిల్చే వుంటుంది

మానవ జీవితంలో తప్పక చూసి తీరవలసిన పుణ్యక్షేత్రం జ్యోతిర్లింగ - శక్తి పీఠం”..!!శుభం భూయాత్.



No comments:

Post a Comment