Monday 26 May, 2014

Why there are so many Hindu Gods



హిందువుల్లో అంతమంది దేవుళ్ళు ఎందుకని కొందరి వాదం.
ఒకసారి ఒక ఆంగ్లేయుడు సత్యశోధన కోసం అనేక మత గ్రంధాలు శోధించాడు అయన స్వతహాగా క్రీస్టియన్. అన్ని మతాలు వెదికి చివరికి హిందూ సనాతనధర్మం లో ఉన్న రామాయణ, భారత, భాగవత, పురాణాలు, వేదాలు ఉపనిషత్తులు చదివాడు. ఎన్నో ఏళ్ల నుండి తను చేస్తున సత్యాన్వేషణ హిందూ సనాతన ధర్మం వలన లభించింది అని అన్నాడు.
తరువాత మనం పైన వేసిన ప్రశ్నకి అయన ఇలా సమాధానం చెప్పాడు.
తల్లి తన బిడ్డకి ఆకలి వేసినప్పుడు చేతిలో గరిటెలు పట్టుకుని అన్నపూర్ణా దేవిలా మారుతుంది. అమ్మా లెక్క నాకు అర్థం కాలేదు అంటే పుస్తకం తీసుకొని ఇలా చెయ్యమని సరస్వతి అవుతుంది. అమ్మ ఖర్చులకి డబ్బులు కావాలంటే తన చేతితో డబ్బు ఇచ్చి లక్ష్మిదేవిలా మారుతుంది. ఏదైనా తప్పు చేస్తే దండించి ఆదిపరాశక్తి లా మారిపోతుంది.
ఇలా ఎదురుగా ఉన్న తల్లి వివిధ సందర్భాలలో వివిధ రకాలైన అవతారాలు ధరిస్తుంటే, తను సృష్టి చేసిన దేవుడు తన పిల్లల కోసం ఎన్ని అవతారలైనా ధరిస్తాడు. అందుకే హిందూ మతంలో ఇన్ని మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు అన్నాడు.
అలానే కాకుండా హిందూ ధర్మంలో ఉండి ఏమి లేదు అనుకునేవారు కూడా సరిగ్గా ఆరాధిస్తే ఫలితం తెలుస్తుంది. ఎలాగంటే

No comments:

Post a Comment