సీతాకుండ/(దేవి భవాని) శక్తి
పీఠం బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ జిల్లాలో(వాయువ్య చిట్టగాంగ్) కు 40 కిలోమీటర్ల దూరంలో
ఢాకా-చిట్టగాంగ్ హైవే [పాత పరిపూర్ణ-షా
గ్రాండ్ రోడ్డు], సీతాకుండ/సీతకుండు రైల్వే స్టేషన్ సమీపంలో, చంద్రనాధ్ (చంద్ర-నాథ్ కొండలపై)
కొండశిఖరం పైన కొలువు దీరివుంది.
దీనికి దిగువున శంభూనాధ్ దేవాలయం కూడా వున్నది.
పురాణ
గాధ ప్రకారం భార్గవ ముని, రామచంద్రని అరణ్యవాస
సమయంలో ఈ ప్రాంతం సందర్శించినప్పుడు
సీతా దేవికి స్నానం కోసం ఒక చెరువు
(కుండ్) సృష్టించినట్లు తెలియవస్తోంది. అందుచేత ఈ ప్రాంతం సీతాకుండగా
పిలవబడుతోంది.
పురాణాల
ప్రకారం ఈ ప్రదేశంలో సతిదేవి
కుడి చేయి పడినదని నమ్ముతారు.
ఈ శక్తి పీఠాన్ని”భవన్”
అని కూడా అంటారు.
ఈ భవాని శక్తి పీఠం
సీతాకుండ్ చంద్ర-నాథ్ గా
కూడా ప్రసిద్ధిచెందినది. ఇక్కడ, సతి దేవి “దేవి
భవానీ” రూపంలో మరియు శివుడు చంద్రనాథ్
గా (భైరవ్ Vairabh) గా పూజించబడుతున్నారు. ప్రస్తుతం ఈ
ప్రదేశంలో కొన్ని వేడి నీటి బుగ్గలు
మాత్రం సీతకుండలో కనపడుతాయి.
ఆధునిక చరిత్ర లో “రాజమాల” గ్రంధం ప్రకారం సుమారు 800 సంవత్సరాల క్రితం రాజా బిస్వంబర సుర్ ( ప్రసిద్ధ Adisur యొక్క వంశస్థుడు, సముద్ర మార్గం ద్వారా చంద్రనాధ్ పర్వత శ్రేణులను చేరుకోవడానికి ప్రయత్నించారు అని పేర్కొంది. నిగమ్ కల్పతరు గ్రంధం ప్రకారం ఈ చంద్రనాధ్ లోనే జయదేవ కవి కూడా నివసించినట్లు సూచిస్తోంది.
త్రిపుర
పాలకుడు ధన్య మాణిక్య ప్రభువు
సమయంలోనే ఈ చంద్రనాధ్ ఆలయం
అనేక మాన్యాలు పొందింది. ధన్య మాణిక్య ప్రభువు
చంద్రనాధ్ ఆలయం నుండి శివుని
విగ్రహం తొలగించి తన రాజ్యంలో ప్రతిష్టించటానికి
ప్రయత్నించి విఫలమైనట్లు చరిత్రలో పేర్కొనబడింది.
చంద్రనాధ్
ఆలయ సమీపంలో వున్న ఈ ప్రసిద్ధ
శక్తి పీఠం బంగ్లాదేశ్ లోని
హిందూ మత యాత్రికులకు ఒక
పవిత్ర ప్రదేశం.
సీతకుండ్(భవాని) శక్తి పీఠం దర్శించి
ఆ దేవి కృపకు పాత్రులు
కండి..!!!! శుభం భూయాత్
No comments:
Post a Comment