మగధ శ్రీ“సర్వానందకరీ” దేవి
శక్తి పీఠం భారత దేశంలో,
మగధ రాజ్యం (ఇప్పటి బీహార్ రాష్ట్రం)లో, పాటలీ పుత్ర
నగరం(పాట్నా)లోని పాట్నా రైల్వే
స్టేషన్ కు 10 కి.మీ.
దూరంలో మహారాజ్ గంజ్ ప్రాతంలో “బడీ
పటాన్ దేవి” ఆలయంలో వుంది.
ఈ ప్రదేశంలోనే సతి దేవి యొక్క
“కుడితొడ” పడినదని చెపుతారు. ఇక్కడ ఉత్తరాభి ముఖంగా
వున్న సతీ దేవి(సర్వానందకరీ)ని “బడీపటాన్ దేవి”అని, పాటలీ పుత్రేశ్వరిగా, పరమశివుని “వ్యోమ్యకేష” గా పూజిస్తారు. కాలక్రమేణా
ఇదే ఆలయంలో మహాకాళీ, మహలక్ష్మి, మహా సరస్వతీ దేవి
మూర్తులు కూడా ప్రతిష్టించారు.
ఇక్కడకు
సమీపంలోనే సతీదేవి యొక్క"పాట్"(వస్త్రం) పడిన ప్రదేశంగా “పాటలీపుత్ర
నగరం(పాట్నాసిటీచౌక్)నమ్ముతారు. ఆగ్నేయ ముఖ ప్రదేశాన్ని”ఛోటీ
పటాన్ దేవి” ఆలయంగా, ఈ
నాటి “పాట్నా”గా పిలుస్తున్నారు.
పురాణ,
చారిత్రికంగా ఈ దేవేరు లిద్దరూ
పాటలీపుత్ర నగర ప్రదేశాన్ని రక్షిస్తూ
ఉంటారని భక్తుల నమ్మకం. ఈ ప్రదేశాన్ని పాలించిన
పాటలీపుత్ర – పుత్రకుడు తన రాణి కోసం
అద్భుతమైన ఇంద్రజాల శక్తులతో ఒక నగరాన్ని నిర్మించాడు.
అదే “పాతాళీ” గా ("ట్రంపెట్ పుష్పం" అని అర్థం) “పాతాళిగ్రామ్”గా పిలవబడేది. రాణికి
జన్మించిన ప్రధమ సంతాన గౌరవార్ధం
దీని పేరు “పాటలీ పుత్ర”
గా పెట్టబడింది
ఈ ఆలయాన్ని చేరుకోవడానికి పాట్నా బస్సు స్టాండ్, గుల్జార్
బాగ్, పాట్నా సిటీ రైల్వే స్టేషన్
ల నుండి రిక్షాలు వంటి
అనేక స్థానిక రవాణా, టాక్సీలు అందుబాటులో ఉంటాయి.
భారత
దేశంలో అతి పురాతన నగరాలలో
ఒకటిగా,పురాణ,చారిత్రక ప్రాధాన్యత
గలిగి, తప్పక దర్శించవలసిన స్థలాలలో
ఒకటి ఈ పాటలీపుత్ర నగరం..!!
శుభం భూయాత్.!
No comments:
Post a Comment