Wednesday, 3 September 2014

పార్థ సారథి దేవాలయం

పార్థ సారథి దేవాలయం చెన్నైలోని ట్రిప్లికేనులో కలదు. సంస్కృత భాషలో పార్థసారధి అంటే పార్థుడు = అర్జునుడు యొక్క సారథి = రథాన్ని నడిపినవాడు అని అర్థం అంటే శ్రీ కృష్ణుడు.

ఆళ్వారులచేత పాడబడిన 108 దివ్య స్థలములలో " తిరువళ్ళిక్కేణి" కూడా ఒక దివ్య స్థలము . పుణ్యక్షేత్రాన్ని " బౄహదారణ్య " క్షేత్రం అనే పేరుతో పిలుస్తుండే వారు . దేవాలయము 1000 సంవత్సరములకు ముందే నిర్మిచబడింది . దేవాలయమందున్న శిలలేఖములవలన క్షేత్రమును నందివర్మ అనే పల్లవరాజు (779 - 830 ) మరియు విజయనగర రాజైన వేంకటపతి మహారాజు (1586 - 1616 ) మొదలైన మహారాజుల పాలనలో ఉండేదని తెలుస్తుంది . దివ్య మందిరము యొక్క మూలవిరాట్టు శ్రీ పార్ధ సారధి స్వామి యొక్క నిలువెత్తు విగ్రహము దర్శనం ఇచ్చును . స్వామి వారు ఎడమ భాగము నందు "పాంచజన్య శంఖము " కనిపించును . దక్షిణ భాగమున శ్రీ చక్రము కాకుండా హస్తము పదము వైపు చూపించెను. స్వామి వారు తూర్పు దిక్కున చూస్తున్నట్లు దర్శన మిచ్చును .స్వామి వారి భార్య రుక్మిణి ,అన్న బలరాముడు, తమ్ముడు సత్యకి కుమారుడు ప్రద్యుమ్నుడు , మనుమడు అనిరుద్ధుడు మొదలుగువారి సమేతంగా పార్ధ సారది దర్శన మిచ్చును . ఈయన మరో పేరు " వెంకట కృష్ణ ".

No comments:

Post a Comment