Wednesday, 3 September 2014

అలోపీ శంకరీ(మహేశ్వరీ)” శక్తి పీఠం ( ALLAHABAD )

“అలోపీ శంకరీ(మహేశ్వరీ)” శక్తి పీఠం (అలోపీ దేవి మందిర్) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో, అలహాబాద్ లోని పశ్చిమ దారాగంజ్ ప్రాతంలో, అలోపీ బాగ్ లో (సిటీ సెంటర్ నుండి 5 కిమీ) వుంది. ఈ శక్తి పీఠం పవిత్ర “త్రివేణి సంగమం” కు (గంగా, యమున, సరస్వతీ) సమీపంలో ఉంది.
ఇక్కడ సతీ దేవి చేతివేళ్లు (హస్తాంగుళీలు) పడినవని చెపుతారు. ఆలయ గర్భగుడి లో ఒక పాలరాయి వేదిక పై న ఒక చిన్ని చెక్క ఊయల(ఝూలా) నే దేవి రూపంగా పూజిస్తారు. ఈ ఊయలకే (ఝూలా) భక్తులు తమ మొక్కులు తీర్చుకొంటారు.
సతీ దేవి శరీరంలోని చివరి అవశేషాలు (భాగం) ఈ స్థలం వద్ద పడి, సతీ దేవి అదృశ్యం అయినందువలన “అలోపీ”(అదృశ్యం, కను మరుగైపోయిన ) ప్రదేశంగా పేరొందింది,.
ఆ “అలోపీ దేవి”ఊయల(ఝూలా) రూపంను మీరు దర్శించుకొని తరించండి.!! శుభం భూయాత్.



No comments:

Post a Comment