Thursday 14 August, 2014

"దంతేశ్వరిదేవి” శక్తిపీఠం

శ్రీదంతేశ్వరిదేవిశక్తిపీఠం భారతదేశంలో-ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలో, దక్షిణ బస్తర్ జిల్లా, దంతెవాడ తాలూకాలో - దేవిపేరునే పిలవబడే -“దంతెవాడపట్టణంలో, జగదల్ పూర్ కు సుమారు 120 కి.మీ. దూరంలో - “దంఖీణి” –“శంఖిణినదుల సంగమ (కలిసే) ప్రదేశంలో - వెలసిన సుప్రసిధ్ధ పుణ్య క్షేత్రం !!
ఆలయాన్ని 13 శతాబ్దంలో వరంగల్కాకతీయ రాజులుపునరుద్ధరించారు. కాకతీయ రాజులు కట్టిన ఆలయం పూర్తిగా ధ్వంసం అయి, కొన్ని స్తంభాలు మాత్రమే ఇప్పుడు మిగిలాయి.
ప్రస్తుత ఆలయం చెక్క స్తంభాలు మరియు ఇటుక పైకప్పు తో ఉంది. దీనినిబస్తర్ రాజకుటుంబంవారు 20 శతాబ్ద ప్రారంభంలో పునర్నిర్మించారు.
దేవి, సంప్రదాయ సిద్దంగా, బస్తర్ వాసుల ( గిరిజనుల) “కులదేవత”. ఆలయం వారి మత-సామాజిక సాంస్కృతిక చరిత్రకు ప్రతీకగా నిలుస్తోంది.
ఇక్కడ సతీదేవిదంతాలుపడినట్లు చెపుతారు.
ప్రతి సంవత్సరం, పరిసర గ్రామాలలో వుండే గిరిజనులు, “దసరా సమయంలోదేవి పురాతన విగ్రహం ఆలయం నుండి బయటకు తీసి దానినికాగడాలవెలుతురులో ఆకర్షణీయంగా,ఊరేగింపుగా నగరం చుట్టూ త్రిప్పి పండుగ చేసుకుంటారు.. ఇప్పుడు ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా తీర్చబడింది !!

ఇదిగో.. ఆదేవాలయాన్ని, శ్రీ దంతేశ్వరీ దేవిని దర్శించుకోండి..!! ధన్యులు కండి !!



No comments:

Post a Comment