Thursday, 14 August 2014

సరస్వతీ నది

సరస్వతీ నదిహిందూ పురాణములలో చెప్పబడిన పురాతనమైన నది.
ఋగ్వేదమునందలినదిస్తుతినందు చెప్పబడిన సరస్వతీ నదికి,
తూర్పున - "యమునా నది” - పశ్చిమాన -శతద్రూ(సట్లేజ్) నదికలవు.
తరువాత కాలంలో, “మహాభారతములో నదిఎండిపోయినట్లుచెప్పబడినది…!
సింధు లోయ నాగరికతకాలంనాటి అవశేషాలు ఎక్కువగా సింధు నదికి తూర్పున, ఘగ్గర్-హాక్రానది ప్రాంతములలో లభించినాయి.
ప్రస్తుతము అక్కడసరస్వతి అనే పేరుమీద చిన్న నదికలదు. ఇదిఘగ్గర్నదికిఉపనది”. బహుశా, పురాతన సరస్వతీ నదికి శాఖఅయి ఉండవచ్చు…!
ఋగ్వేదములో సరస్వతీ నది ప్రముఖముగా చెప్పబడినది. మొత్తంఅరవై పర్యాయములు” (ఉదాహరణకు: 2.41.16; 6.61.8-13; 1.3.12.) సరస్వతీ నది ప్రస్తావనకు వస్తుంది...!
నదిఏడు పుణ్య నదులలో ఒకటి గా చెప్పబడింది .. భాషా పరంగా - “సరస్వతిఅనగాఅనేక పాయలతో ప్రవహించు నదిఅని అర్థము...!
ఋగ్వేదములో సరస్వతీ నదిని అన్నింటికంటే ఉత్తమమైన నదిగా కీర్తించినారు. దీనినిఏడవ నదిగా, “వరదలకుతల్లిగా, ఉత్తమ తల్లిగా, ఉత్తమ దేవతగా, ఉత్తమ నదిగా కీర్తించినారు. (ఋగ్వేదము 2.41.16-18; మరియు 6.61.13; 7.95.2)
(ఋగ్వేదము: 7.36.6. సరస్వతి సప్తః సింధుం", 2.41.16 లో-“ ఆంబితమే నాదీతమే దేవితమే సారస్వతి" దీనిని బట్టి సరస్వతీనది ప్రాముఖ్యత అర్థము అవుతుంది.
ఋగ్వేదము 7.95.1-2 నందు సరస్వతీ నదినిసముద్రమువైపు ప్రయాణము చేయునదిగా కీర్తించినారు..!.
ప్రస్తుతము చాలామంది పండితులు, గఘ్ఘర్-హక్రా నదే సరస్వతీ నదిగానో, లేదా కనీసం పాయగానో ఒప్పుకుంటారు,
కానీ పేరు ఆఫ్ఘనిస్తాను నుండి పంజాబుకు వెళ్ళినదా లేదా పంజాబునుండి ఆఫ్ఘనిస్తానుకు వెళ్ళినదా అనే విషయముపై భిన్నాభిప్రాయములు ఉన్నాయి.
ఇక, “ఇస్రో – ISRO” అందించినఉపగ్రహ ఛాయాచిత్రాలఆధారంగా సరస్వతీ నదిహిమాలయాల్లో పుట్టి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి కచ్ సింధుశాఖ (రాన్ ఆఫ్ కఛ్) వద్ద అరేబియా సముద్రంలోకలుస్తోంది.
నది యొక్కమొత్తం పొడవు సుమారు “1,600 కిలోమీటర్లు”. మార్గంలో చాలా ప్రాంతాలలో.ఎన్.జి.సి. భూగర్భ జలాల నిల్వలను కనుగొంది.
రాజస్థాన్ లోనిజైసల్మేర్ ఎడారి ప్రాంతంలో 13చోట్లబోరుబావులుతవ్వగా “35-40 మీటర్ల లోతుననీటి నిల్వలు లభించాయి. “కార్బన్ డేటింగ్ద్వారా నీరు “4 వేల సంవత్సరాల నాటిదని గుర్తించారు.
1986 నుండిసరస్వతి నది పునరుద్ధరణకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి మొదలుపెట్టాయి. వాటిలో, హర్యానాలోనిసరస్వతి నది శోధ్ సంస్థాన్చేపట్టిన కార్యక్రమాలు అక్కడి ప్రభుత్వాన్ని ఉత్తేజపరిచాయి.!
2002 లో ఎన్.డి.. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 40 అడుగుల వెడల్పు, 12 అడుగుల లోతు, మరియు 50 కిలోమీటర్లు పొడవున్న సరస్వతి మహానదిరూపనహర్కాలువను తవ్వించారు..!!
దీనిపై, విదేశస్తులు కూడా చాలా పరిశోధనలు చేసి తేల్చిన విషయం ఏమిటంటే,వేదాలలో చెప్పబడిన సరస్వతి నది నిజంగానే భారత ఖండంలో ప్రవహించి, ఈనాటికీఅంతర్వాహినిగా ప్రవహిస్తూసజీవ నదిగా విరాజిల్లుతోందని,
దానిపై చాలా గ్రంధాలు, పుస్తకాలను కూడా వ్రాసారు. !!
BBC Radio–“చానల్ -4”లో Saturday 29 June, 2002 at 3.30pm “India’s Miracle River “ అనే శీర్షిక పై, నది పై ఒకప్రసారంకూడా చేశారు. “http://news.bbc.co.uk/hi/english/world/south_asia/newsid_2073000/2073159.stmపై క్లిక్ చేసి చూడవచ్చు.!

నది పుట్టుక స్థానం (ముఖ ద్వారం) Bhim Pul in Mana Village near Badrinath నుండి మొదలు పెట్టి, నదిబాహ్యంగాఅలాకానందలో కేశవ ప్రయాగవద్ద కలసి, అటు తర్వాతఅంతర్వాహినిగాగుజరాత్ రాష్టంలో ప్రవహిస్తున్న పరీవాహక ప్రదేశాల, “కచ్ సింధు శాఖలోనదీ సంగమప్రదేశాలను, వరుసక్రమంగా (sequential) అమర్చినకొన్ని అపురూప చాయా చిత్రాలను చూచి ఆనందించండి..!!

No comments:

Post a Comment