Thursday, 14 August 2014

నాలుగు శక్తి పీఠాలు … ఇప్పటి బంగ్లాదేశ్ లో

1. శ్రీ బబాణి పూర్ (భవానిపూర్) “అపర్ణాదేవిశక్తిపీఠ్: దీనిపై రెండు కధనాలు వినిపిస్తునాయి..!
()ఒక కధనం ప్రకారంఇది బంగ్లాదేశ్ లోని రాజ్ షాహీ డివిజన్ లో, బొగ్ర తాలూకా, షేర్పూర్ ఠాణా పరిధిలోని, బవానీపూర్ గ్రామంలోకరాతోయా నదిఒడ్డున వుంది.
()రెండో కధనం ప్రకారంభవానిపూర్ లోని “Shakha-Pukur” పవిత్రసరస్సు వద్దవున్నదని నమ్ముతారు. దీనిని బంగ్లాదేశ్ సంయుక్త సైనిక దళాలు, అనధికార నిర్మాణం పేరిట “Bhabani దేవాలయంనాశనం చేశారని, అది ఇప్పుడు "భవాని పూర్ ఆలయం పునరుద్ధరణ, అభివృద్ధి మరియు నిర్వహణ కమిటీ" ఆలయాన్ని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆలయంలోని దేవత పేరుకాళి విగ్రహాన్నేఅపర్ణగా సంస్కరించారు.
ప్రదేశంలోనే సతీ దేవి చీలమండ ఆభరణం, కుడి కన్ను లేదా ఎడమ ఎముకలు Bhabanipur లో పడిన పవిత్రమైన ప్రదేశంగా భావిస్తున్నారు. ఇక్కడ జరిగే ముఖ్యమైన పండుగలు - రామనవమి, మాఘ మాసంలో వచ్చేమాఘి పూర్ణిమ”, చైత్ర మాసంలో ఒక పెద్దమేళాలు. (ఫోటోలు చూడండి )
2. సునంద(సుగంధ) శక్తి పీఠ్ : ఇది బంగ్లాదేశ్ లో,Barisal జిల్లా, Gournadi ఠాణా పరిధిలో ఉత్తర శిఖర్ పూర్ గ్రామంలో కొలువై వున్నది. ఇది సోండా( సునందా)(Soundha/Shandha) నది ఒడ్డున, Barisal పట్టణం నుండి 20 కిమీ దూరంలో ఉంది. దేవత స్థానికంగాసాంచురీ” (శాంకరీ దేవి) అంటారు. ఇక్కడ మార్చిలోశివ చతుర్దశి” (శివరాత్రి) పండుగను ఘనంగా జరుపుకుంటారు. (ఫోటోలు చూడండి)
3. Jayanti (Jayantia): జయంతి శక్తిపీఠం : ఇది బంగ్లాదేశ్ లోని Jaintiapur Sylhet లో,Sylhet పట్టణం( Sylhet డివిజన్లో ఉత్తరాన 43 Km దూరంలో గల Kalajore Bourbhag గ్రామం దగ్గర ఉంది. (ఫోటో చూడండి )
ఇక్కడ కూడాశక్తి పీఠాలు వంటిమూడు ప్రదేశాలు ఉన్నాయి. వాటినేఅసలైన శక్తి పీఠాలుగా నమ్ముతున్నారు. అవి ఏమిటి అంటే..
)షిల్లాంగ్ రోడ్ - ఇది ఖాసీ కొండల మీధ వున్నది. స్థానికంగా వున్న Baurbhag “కాళీ ఆలయంలేదా Falizur “కాళి బారినే శక్తి పీఠం అంటారు . (ఫోటో లభ్యం కాలేదు )
బి) NH-44 షిలాంగ్ కొండల తూర్పున, 65 Km దూరంలో Jayantiya జిల్లా, జోవాయిలో ఉంది . జోవాయి ఉత్తరాన 24 Km దూరంలో గల Nartiang లో Jayanteswari దేవాలయం ఉంది. ఇది నాలుగు శతాబ్దాల క్రితంశిధిలమైన దేవాలయందాని స్థానంలో దేవాలయాన్ని కొత్త మార్పులతో నిర్మించారు. ఆసక్తికరమైన విశేషం ఏమంటే, ఇక్కడ రెండు 6-8 అంగుళాల astadhatu విగ్రహాలుదుర్గమరియు “Jayanteswari” (Matchyodari) పేర్లతో ఒకేస్థానంలో ఉంచబడి, రెండూ కూడా కలిసి పూజలు అందు కొంటున్నాయి. Nartiang దేవాలయంలో వున్నదుర్గా దేవినే శక్తి పీఠంగా నమ్ముతారు. దేవినేజయంతిఅని పిలుస్తారు.
ఇక్కడే సతీ దేవి ఎడమ తొడ భాగం పడిందని నమ్ముతారు. అందుకనే ఈదేవి“Jayanteswari”గా పిలవబడుతోంది. ( ఫోటో చూడండి )
సి ) జయంతి: ఇది భారతదేశంలో పశ్చిమ బెంగాల్,జల్ పాయ్ గురి జిల్లాలో, Buxa టైగర్ రిజర్వు లోపల ఒక చిన్న అడవి గ్రామం . ఇది జయంతి నది వెంట ఉన్నది . సమీప రైల్వే స్టేషన్ జల్ పాయ్ గురి -న్యూ అలీపూర్ద్వార్ మార్గంలో ఉంది (ఫోటో చూడండి )
4.శర్వాణి (Sharvani-Kanyashrama)శక్తిపీఠం: ఇది బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ తాలూకా, కుమారికుండ్ లో వుంది. శక్తి పీఠంస్థల నిర్ణయంపై కూడా రెండు అభిప్రాయాలూ ఉన్నాయి. అవి,
చిట్టగాంగ్ నుండి 22 కి.మీ. దూరంలో గలకుమిర రైల్వే స్టేషన్వున్న కుమారికుండ్/కుమారీ కుందూ ఒకటి.
కన్యాకుమారిదేవాలయ పరిసరాల్లోనిభద్రకాళిదేవాలయం రెండోది.
ఇక, పైన చెప్పబడిన ప్రదేశాలలోనే కాకుండా... Jessore వద్దనున్న“Jeshoreshwari Kali Temple”ని కూడాశక్తిపీఠంగాపిలవబడుతోంది. (ఆలయ ఫోటో ను చూడండి)
5. యశోరేశ్వరి Yashoreshwari (Yashora) శక్తిపీఠం: బంగ్లాదేశ్ లో దౌలత్ పూర్, Maheswaripur దగ్గర Ishwaripur లో, Shyamnagar Upazilaలో, సత్ఖిరాకు జిల్లా (Jessore మరియు Khulna నుండి 125 Km) వద్ద ఉంది.
Jossoreshwari కాళి ఆలయం, పూర్వ ఆలయ అవశేషాల వద్ధ నిర్మించబడిన ఒక అద్భుతమైన రెండస్తుల భవనం.
ఇక్కడ సతీ దేవిచేతులు మరియు అరికాళ్లుపడ్డాయని చెపుతారు.

ఇదండీ .. బంగ్లాదేశ్లో వున్న నాలుగు శక్తిపీఠాలకధ..! అన్ని శక్తి పీఠాలను చూడాలనుకునే వారికి తెలియాలనే .. నా చిరు ప్రయత్నం.!!

apparna devi :



3. jayanti






No comments:

Post a Comment