Thursday 14 August, 2014

శ్రీ పాండురంగ స్వామి దేవాలయం .. మచిలీపట్నం

శ్రీ పండరీపురం - పాండురంగ దేవాలయం లాంటిస్వయంభూగా వెలసిన ఇంకొక పాండురంగని ఆలయం ...
మన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వున్నదని..?
ఇదిగో .. ఇక్కడ .. దాని వివరాలను .. చదవండి.. స్వామిని దర్శించండి.. ధన్యులు కండి.. రండి..!!
శ్రీ పాండురంగ స్వామి దేవాలయం .. మచిలీపట్నంనికి సుమారు 5 k.m. దూరంలో, చిలకలపూడిలో గలకీర పండరిపురంప్రాంతంలోశ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయంగా పిలవబడుతూ, “స్వయంభూగా వెలసిన
ప్రసిధ్ధ పుణ్యక్షేతం..!
దేవాలయంభక్త నరసింహంఅనే పరమ పాండురంగ భక్తునిచే, 1929 లో మచిలీపట్నం లోని పై ప్రాంతంలో నిర్మించబడింది. ఈయన బొబ్బిలి మండలం, విశాఖపట్నం జిల్లా కు చెందిన వారు. ఆలయం సుమారు 6 ఎకరాల స్థలం లో బహు సుందరంగా నిర్మిచబడింది. దీనిలోనే భక్త జ్ణానదేవ్, భక్త తుకారాంల మఠం లు కూడా వున్నాయి. ఆలయ నిర్మాణం 17th August of 1927 మొదలు పెట్టబడి 28th June 1928 పూర్తి కావించబడింది.. ఆలయ సముదాయాలు అన్నీ పూర్తిగా కట్టటానికి సుమారు 8 సంవత్సరాలు పట్టి, 1935 లో పూర్తి అయ్యాయి.
ఆలయ నిర్మాణ పూర్తి అయి, గర్భ గుడిలోని మూల విగ్రహం ప్రతిష్టించే సమయంలో, ఒక అధ్బుతం జరిగి శ్రీ పాండురంగడేస్వయం భూగా వెలసినట్లు స్థల పురాణం వలన తెలుస్తోంది..
దేవలయము అన్ని రోజులలో భక్తులతో నిండి కళ కళ లాడుతూ వుంటుంది. ముఖ్యంగా, సముద్ర స్నానానికి వచ్చే భక్తులతో అలాగే అన్ని పౌర్ణమి రోజులలో, అదీ ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు,అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినం లలో భక్తుల తాకిడి విపరీతంగా వుంటుంది.
ఇప్పటికీ దేవాలయం శ్రీ భక్త నరసింహం గారి వశం వారే నడుపుతున్నారు..
ఆలయానికి వున్న ఒక విశేషం ఏమంటే.. పడమర దిశగా వున్న సింహా ద్వారం లోనికి ప్రవేశించిన భక్తులకు తూర్పు ముఖంగా వున్న గర్భగుడిలో స్వామి దర్శనం ఇస్తాడు.
అన్నిటికంటే ముఖ్య విశేషం ఏమంటే ... గుడిలోని మూల విగ్రహం 3 అడుగుల పొడవు వుండి, అన్ని విధాలుగా .. అచ్చు శ్రీ పండరిపురం లోని శ్రీ పాండురంగని పోలివుంటుంది..
ఆయన్ని దర్శించే భక్తులందరికి.. వారు నిజం గా పండరీపురం శ్రీ పాండురంగని దర్శిస్తున్నామనే అనుభూతిని కల్గిస్తుంది.
ఇంకో విశేషం ఏమంటే .. భక్తులు కులం వారైనా సరే , స్వయంగా వారే గర్భ గుడిలోని మూల విగ్రహనికి పూజలు చేసుకోవచ్చు. ఇదే దేవాలయానికి వున్న విశిస్థత.



No comments:

Post a Comment