Thursday 14 August, 2014

శక్తి పీఠాలలో మొట్టమొదటి శక్తి పీఠం శ్రీ శాంకరీ దేవి ఆలయం

మనలో చాలామంది వినే వుంటారు శ్రీ అది శంకరాచార్యులు రచించినలంకాయాం .. శాంకరి దేవి.. “ అని మొదలయ్యే అష్టాదశ శక్తి పీఠ శ్లోకం గురించి..!
శ్లోక లోని ప్రాధాన్యతని బట్టి, శక్తి పీఠాలలో మొట్టమొదటి శక్తి పీఠం శ్రీలంకలో వుందని తెలుస్తోంది ..!
శ్రీ శాంకరీ దేవి ఆలయం ,శ్రీలంక తూర్పు ప్రాంతం లోని Koneswaram లో Trimkomali వద్ద వుందని చెప్పబడుతుంది .TRI-CONA-MALAI యే నేటి Trimkomali గా పిలవబడుతున్నది. దానినే కొనేశ్వరం శాంకరీదేవి ఆలయంగా కూడా పిలుస్తారు .
అయితే ప్రస్తుతం, ప్రదేశంలో .. ఆలయం లేకపోయినా, శ్రీ శాంకరీ దేవి ఆలయం ఖచ్చితంగా వున్నదని చెప్పినచోట, అది వున్నట్లు చూపే గుర్తుగా, ఒక స్తూప స్థంబాన్ని కొండ శిఖరం మీద నిర్మిచారు.
ఆలయాన్ని 16 -17 శతాబ్దం మధ్య పోర్చుగీస్ వారు నాశనం చేశారు. చరిత్ర ఆధారంగా 17 శతాబ్దంలో పోర్చుగీస్ వారు ద్వీపాన్ని ముట్టడించారు. కొండ శిఖరం పైన వున్న ఆలయాన్ని వారి ఓడ నుండే ఫిరంగులతో దాడి చేసి పూర్తిగా నాశనం చేశారు.
అయితే, శాంకరీ దేవి విగ్రహాన్ని, ఆలయం వున్నదని చూపిన స్థలం ప్రక్కనే, ఇప్పుడు ఉన్న శ్రీ త్రికోనేశ్వర (శివ) స్వామి ఆలయంలో భద్రపరచ బడిందని భక్తుల విశ్వాసం.
ఇటీవల నిర్మాణం చేసిన ఆలయాన్ని, శాంకరీ దేవి ఆలయంగా కంటే కూడా, స్థానికులు శివాలయం గానే భావిస్తారు.
(TRI-CONA MALAI అంటేత్రిభుజం ఆకారంలోవున్నకొండపై ఉండటం వల్ల - దేవుణ్ణి శ్రీ త్రికోనేశ్వర స్వామిగా పిలుస్తారు.
శివాలాయం ప్రక్కనే... ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు.. ఆలయంలోని కొలువైవున్న దేవినే శాంకరీ దేవిగా కొలుస్తున్నారు.

ఇదిగో .. మొట్టమొదటి శక్తి పీఠాధి దేవత అయిన శ్రీ శాంకరీదేవిధ్యాన రూపం”, “విగ్రహరూపాలను,స్తూపాల ఫోటోలను, చూసి, తరిద్ధామ్..!!



No comments:

Post a Comment