Thursday, 14 August 2014

శ్రీ వైష్ణవ దేవి

జమ్మూ-కాశ్మీర్ లోనిమాతా వైష్ణోదేవిఆలయాన్ని - మాత పిలుపు(Maa Ka Bulawa)” రాకుండా యాత్ర చేయలేమని.. ?
శ్రీ వైష్ణవ దేవి ఆలయం ప్రసిద్ధి చెందినదేవిపుణ్యక్షేత్రం. వైష్ణవ దేవి పుణ్యక్షేత్రంత్రికూటపర్వతాలపై నెలకొని ఉన్నది. హిందువులు వైష్ణవదేవినేమాతా రాణిఅనివైష్ణవిఅని కూడా సంభోదిస్తారు. అమ్మ వారి ఆలయం ఉత్తర భారతాన జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో, జమ్ముకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలోవున్నజమ్ము జిల్లాలోనికాట్రా పట్టణంలో,ఎత్తైనహిమాలయపర్వత ప్రాంతంలోత్రికూట పర్వత శేణిలోని ఒక గుహ(Gufa) లో ఉన్నది !!
పవిత్రమైనగుహయొక్కకాలనిర్ణయంభౌగోళిక అధ్యయనం ప్రకారం, దాదాపుఒక మిలియన్ సంవత్సరాల వయసుగా సూచించబడింది.!!
“Trikuta పర్వతంయొక్క ప్రస్తావనఋగ్వేదంలో కూడా వున్నది. దేవి ప్రస్తావనమహాభారతంలో కూడా కనపడుతుంది. పాండవ-కౌరవుల సైన్యాలకురుక్షేత్ర యుధ్ధసమయంలో, శ్రీ కృష్ణుని సూచనలపై, అర్జునుడుయుద్ధభూమిలో విజయంకోసంవైష్ణోదేవినిధ్యానం చేసి ఆమె దీవెనలు పొందినట్లు చెప్పబడింది. అర్జునుడు తన ప్రార్ధనలో, ఈమెనివాసస్థానంను (బహుశా ప్రస్తుత జమ్మూప్రాంతాన్నిసూచిస్తూ) 'ఎల్లప్పుడూజంబూ పర్వతవాలు ఆలయంలో నివసించు .. దేవిగా అనినట్లు (అంటే...'Jambookatak Chityaishu nityam Sannihitalaye' వంటి వాక్యంలో) మాత యొక్క చిరునామా సూచించ బడింది. పాండవులు తమ విజయానికి చిహ్నంగా, దేవికి గౌరవ, కృతజ్ఞతలుగాఐదూ రాతి నిర్మాణాలుకావించి వుండవచ్చని అవి కొండ పైన “Trikuta Mountain” ప్రక్కనే ఉన్నాయని చెపుతారు.
జమ్ము నుండికాట్రాప్రాంతానికిహెలి కాప్టర్లలో కూడా వెళ్లవచ్చు. రైలు, మరియు ఇతర వాహన సాధనాలు కూడా వుంటాయి. కాట్రా నుండికాలి నడకన, గుర్రాల(Pony)మీద, పల్లకి(palakan)ల్లోఎలాగైన వెళ్లవచ్చు.
ఆలయం సుమారు “11 కిలో మీటర్లదూరంలో “5200 అడుగులఎత్తులో వున్న పవిత్రమైనగుహలో” (గర్భగుడి) లోపల వున్నది. పవిత్రమైనగుహసుమారు 98 అడుగుల పొడవు ఉంటుంది. గుహ లోపల మాతా వైష్ణోదేవిమూడురూపాల్లొ, “మహాకాళి, మహాలక్ష్మి,మహా సరస్వతిలుగా దర్శనమిస్తుంది. అమ్మవారువిగ్రహరూపంలో కాకుండా కేవలం మూడుపిండ” (Pindies) రూపంలలో దర్శనమిస్తారు. ఆలయానికి వెళ్లే దారిలో తప్పక దర్శించ వలసిన ఇతర పురాతనమైన చిన్న ఆలయాలు కూడా వున్నాయి !!
అన్నిటి కంటే అతి ఆశ్చర్యకరమైన .. నిజం ఏమంటే .. శ్రీ మాతా వైష్ణోదేవి పవిత్ర-పుణ్యక్షేత్రం ప్రయాణంమాత పిలుపు” -”Maa Ka Bulawa” తోనే మొదలవుతుంది. ఇది ఒక నమ్మకమే కాకుండా, ప్రతి వారికీ ఒక బలమైనఅనుభవంమరియు నిజం కూడా !!
మాత వైష్ణోదేవిఆమె పిల్లలకుఒకపిలుపు” “” Maa Ka Bulawa”పంపిస్తుంది. ప్రతి భక్తుడు పిలుపుపైఆమె దీవెనలు పూర్తిగా పొందిన తరువాతమాత్రమే సందర్శించగలుగుతాడు. భక్తుడుకుంటి గాని, గుడ్డి గాని,పడుచుకాని, ముదుసలి కానీ,లేవలేని వారు కానీఎవరయినా సరే .. “మాత పిలుపుపై అక్కడకు వెళ్ళి తీరుతారు !! ఇది పచ్చి నిజం ..!! అందరి భక్తులకు అనుభవైకమే ..!! ఎవరుఎన్నివిధాలుగా అనుకున్నా కూడా - ఇది ప్రతివారిస్వీయాను అనుభవంఅన్నమాట మరువకూడదు !!
ఇదే, వ్యాసకర్తయొక్కస్వీయానుభవంకూడా!! దేవి పిలుపుపై (1995,1998 2006) మూడుసార్లు ఆమె పాదాలచెంత నిలివగలిగాడు!!
ఇక, త్రికూట పర్వతం పైకి వెళ్ళే “11 కిలో మీటర్ల నడక దారిచాల కష్టతరమైనది. తిరుపతి కొండ ఎక్కేవారుగోవిందా గోవిందఅని అరుస్తున్నట్లె, ఇక్కడ పర్వతం ఎక్కేవారు కూడాజై మాతాదీ” “జై మాతాదీఅంటూ ఆమె నామస్మరణతోనే ఎక్కుతుంటారు, ఒకరిని ఒకరు అదేనామస్మరణతోపలకరించుకుంటారు కూడా. మొదటిసారిగామాత పిలుపుని అందుకున్న భక్తులు నడక మార్గంతోనే దేవిని దర్శించునేందుకు ఇష్టపడతారు.
ఈఆలయ వున్న ప్రాంతాన్నిభవన్అని అంటారు. నడకదారి ప్రయాణంసుమారు 6 – 8 గంటలు పడుతుంది. అందువల్ల భక్తులు తెల్లవారుఝామునే నడక మొదలుపెడతారు. ఆలయం ఇంకా చాలదూరంలో వుందనగానె మాతాదీభవన్బహుసుందరంగా, కనులపండువుగా,వళ్ళు పులకరింపుగా,నడక శ్రమ తెలియనంతగా, మనకు కనిపుస్తూనే, రమ్మని పిలుస్తున్నట్లు వుంటుంది.!!
బోర్డు వారు భక్తులను గ్రూపులుగా విభజించి వారికి Yatra (Parchi)Tickets నెంబరిస్తారు. దాని ప్రకారం భక్తులను ఆలయంలోనికి అనుమతిస్తారు.“అత్యంత భద్రతా కారణాలపై సైన్యం ఎల్లవేళలా అక్కడ్ కాపలా కాస్తూ వుంటుంది. ఎప్పుడూ ప్రాంతం అంతా వారిఅజమాయిషీలోనే వుంటుంది. ఆలయంలోపలికిదువ్వెన్నలు, సెల్ ఫోన్లు, పెన్ లు, పిన్నీసులు, కెమరాలు, అలాగె తోలుతో చేసినబెల్ట్లాంటి వస్తువునుఅనుమతించరు”. కనుక వాటిని కలిగి వున్నవారు వాటిని అక్కడేభవన్ -లాకర్లలోభద్ర పరుచుకోవచ్చు.“బోర్డువారే నడుపుతున్న”Bhaint Shop” గతంలో భక్తులు సమర్పించినచీరలు, పాటల క్యాసెట్లు, దేవి బొమ్మతో వున్న coins లాంటి వస్తువులుకొనవచ్చు. బోర్డువారేభోజనాలయకూడా నడుపుతున్నారు. ప్రైవేట్ వ్యక్తుల వారివి కూడా వుంటాయి కానీ వాటిలోని వస్తువులు ఎంతవరకు నమ్మవచ్చో ప్రశార్ధకమే !!
ఇకభవన్నుండితిరుగు ప్రయాణానికివేరొక వైపు నుండిరెండో మార్గంకూడా ఏర్పరచారు. మార్గంలోక్రిందకు తిరుగు ప్రయాణంచేయలేని వారికి వయోవృధ్ధులకు ఇతర సాధనాలకు తోడు “Battery Car” సౌకర్యం కూడా బోర్డు వారు ఏర్పాటుచేశారు.
అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, తల్లిభవన్భక్తుల దర్శనం కోసం, “ఏడాది పొడవునానిరంతరంగా.. తెరిచే వుంటుంది !!
మరొక విశేషం ఏమంటే - “24 గంటలూ” - మనం దేవినిదర్శనంచేసుకోవచ్చు!!.
అర్ధరాత్రి గాని, అపరాత్రి గాని, మిట్ట మధ్యాన్నం గాని, చివరకువేళ-కాని-వేళల్లోకూడా
-ఇతర దేవాలయాల సంప్రదాయాలకు భిన్నంగా - దేవి తన భక్తులకి దర్శనం ఇస్తుంది !!
మాత దర్శనం అయిన బయటకు వచ్చిన వెంటనే బోర్డు వారుప్రసాదంఇస్తారు. పౌచ్లోదేవి వెండి రూపు కూడా ఒకటివుంటుంది. దేవి ఆలయం బయట వున్నచరణామృతంనీటిని భక్తులు శ్రధ్ద్ధగాకాన్లలోపట్టుకుని తీర్ధంగా ఇంటికి తెచ్చుకుంటారు. నీటికి ఔషదీగుణాలు వున్నట్లు తెలుస్తున్నది. మాతచరణ పాదుకలుకూడా మార్గ మధ్యంలో చూడవచ్చు. ఇక్కడే శ్రీభైరవునిఆలయం కూడా ఇంకొంచెం ఎత్తైన పర్వతం మీద వుంటుంది. ఈయన దర్శనం చేయకుండా వైష్ణో దేవి యాత్రపూర్తి అవదని చరిత్ర చెపుతోంది !! యాత్ర ఫలించడాని చెపుతారు..!!
శిఖ్ఖుగురువు అయినశ్రీ గురుగోబింద్ సింగ్యొక్క సందర్శన కూడా (బహుశా పవిత్రమైన, చారిత్రాత్మక గుహ కాబట్టి) పురాతన ప్రస్తావన వల్ల, “ఒక వ్యక్తిగా Purmandal ద్వారా అక్కడ వెళ్ళానుఅని చెప్పబడింది !!
శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయం 1986 సంవత్సరం నుండిఆలయ మరియు యాత్రల నియంత్రణ ,నిర్వహణకోసం “Sri Maata vaishno Devi Shrine Board” (ఆలయ బోర్డు) వారికి అప్పగించబడింది.!! 




No comments:

Post a Comment