Thursday 14 August, 2014

పక్షి తీర్థం

పక్షి తీర్థం ( తిరుకరు కుండ్రమ్) తమిళనాడు కు చెందిన ఒక పుణ్యక్షేత్రం. ఇదిశైవ క్షేత్రం. స్వామిని వేగదీశ్వర స్వామి అని పిలుస్తారు. ఇది కాంచీపురం జిల్లాలో చెంగల్పట్టు నందు కలదు. ఇక్కడ గల కొండపైకి ప్రతి రోజు రెండు పక్షులు వచ్చి ప్రసాదాన్ని తిని వెళుతుంటాయి.

కృత యుగంలో ఒకసారి సర్వ సంగ పరిత్యాగులైన ఎనిమిది మంది మహామునులకు ప్రపంచ భోగములను అనుభవించవలెననే కోరిక కలిగింది. ఇక్కడ వెలసిన కొండపై తపస్సు చేయగా పరమశివుడుప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమన్నాడు. వారు నిజము చెప్పడానికి తటపటాయిస్తూ మాకు మీ సేవయే కావాల న్నారు. కానీ శివుడు వారి మనసులందు కోరిక గమనించి ఎనిమిది మందినీ ఎనిమిది పక్షులై జన్మించ మన్నాడు. ఒక్కొక్క యుగము నందు ఇద్దరు రెండు పక్షాల చొప్పున ప్రతి రోజ గంగా స్నానము ఆచరించి తన ప్రసాదాన్ని తినిపోతూ ఉండమన్నాడు. తరువాత జన్మమున మోక్షం పొందగలరని చెప్పి అదృశ్యం అయ్యాడు.
అలా శంకరునిచే ఆజ్ఞాపించబడిన పక్షులే కృతయుగంలో పూష, విధాతల పేరు గల పక్షులయ్యాయి. త్రేతాయుగమున జటాయువు, సంపాతి అనే పక్షులుగా, ద్వాపర యుగమున శంభుగుప్త, మహా గుప్తులనే పక్షులయ్యాయి. కలియుగమున శంబర, శంబరాదులనే పక్షులై ప్రతి దినము గంగాస్నానము చేసి కొండ పైకి వచ్చి పోతుంటారని స్థల పురాణం చెబుతుంది.
యాత్రికులు ఉదయాన్నే పక్షితీర్థంలో స్నానం చేసి కొండ ఎక్కి స్వామికి పండ్లు, పూలు, కర్పూరం మొదలైనవి సమర్పిస్తారు. దేవాలయ పరివారం విరాళాలను స్వీకరించి చక్కెర పొంగలి, నేయి పాత్రలను స్వామికి సమర్పించి పూజా కార్యక్రమాలను నెరవేరుస్తారు. తరువాత పూజారులు ఒక పక్క, భక్తులు ఒక పక్క కూర్చుని ఉంటే ఆకాశ మార్గాన రెండు పక్షులు వచ్చి చక్కెర పొంగలి తిని, నేతిని తాగేసి పోతుంటాయి. తరువాత ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారు


No comments:

Post a Comment