Thursday, 14 August 2014

MUKTINATH TEMPLE

వైష్ణవులు అంత్యంత “పుణ్యక్షేత్ర ప్రదేశం”గా కొలిచే శ్రీ “ముక్తినాథ్” పవిత్ర ఆలయం ఎక్కడవుందో..?
ఇదిగో .. ఇక్కడ .. చదవండి .. చూడండి ..!! స్వామిని దర్శించుకొందాం..!! ముక్తిని పొందుదాం !!
శ్రీ “ముక్తినాధ్” పవిత్ర పుణ్యక్షేత్రం నేపాల్ లో, 3750 మీటర్ల (12,300 feet) ఎత్తున, “Thorong La” పర్వతప్రాంతవద్ద (దీనినే –ధవళగిరి -అంటారు),ముస్తాంగ్ జిల్లా, “ముక్తినాథ్” లోయలో ఉన్న ఒక “హిందూ, బౌద్ధమత” పవిత్ర ప్రదేశం. ఇది “ఖాట్మాండు” నుండి 140 కి.మీ. దూరంలో “గండకి” నది దగ్గర వుంది.
“ముక్తినాథ్” అనే పేరు “ముక్తి” మరియు “నాథ్” అనే రెండు సంస్కృత పదాల కలయిక. “ముక్తి” అంటే “మోక్షం” అని “నాథ్” ఆంటే “దేవుడు” లేదా “ప్రదాత “ అని అర్థం.ఈ “మోక్ష ప్రదాత” ఆలయం, భక్తులను వేల “జనన–మరణ” (పునర్జన్మ)ల చక్రం నుండి ముక్తి (మోక్షం) సాధించటానికి సహాయపడే ప్రదేశంగా, “ముక్తినాథ్” క్షేత్రంగా పిలవబడుతోంది.
ఈ “ముక్తినాథ్” హిందువులకే కాక “బౌద్ధ మతం” వారికి కూడా ఒక పవిత్ర,తీర్థయాత్ర స్థలం. ముక్తినాథ్ పుణ్యక్షేత్ర ముఖద్వారం పై “శ్రీ మహా విష్ణువు యొక్క చిత్రం” కలిగి “విష్ణు ఆలయం”గా మరియు బౌద్ధుల ఆరాధన చేసే “పగోడ” తరహా నిర్మాణం కలిగి “గొంప” గా, రెండు మతముల వారికి అతి పవిత్రమైన స్థలంగా విలాజిల్లుతోంది.
బౌద్ధమతస్తులు దీనిని Chumig Gyatsa (108 waterspouts) (108 పవిత్ర తీర్థస్థానం) గా పిలుస్తారు.
ఆలయ ప్రాంగణం లోని “కొనేరు”ని "గండకి నది" లేదా ‘చక్ర తీర్థం’ అంటారు. ఆలయ లోపల పుణ్యక్షేత్ర "కనక విమానం" అంటారు.
ఈ ఆలయం ఏడాది పొడవునా తెరిచేవుంటుంది. ముఖ్యంగా “ఋషితర్పణం” “రామ నవమి” మరియు “విజయ దశమి” రోజుల్లో వేలాది మంది భక్తులుఇక్కడకు వచ్చి ఆ పండుగలను జరుపుకుంటారు.
ఈ ఆలయం చేరుకోవటానికి - నేపాలు లోని “ఖాట్మాండు” కు రావాలి. “ఖాట్మాండు” నుండి “జసోమ్” వరకు “విమాన” సర్విస్ వుంటుంది.జసోమ్ నుండి “ముక్తినాథ్” వరకు “హెలికాప్టర్” సర్వీసు ఉంటుంది. జీపు,గుర్రాల మీద కూడ ముక్తినాథ్ చేరుకోవచ్చు.
ఈ ముక్తినాథ్ ఆలయాన్ని “శక్తి పీఠం” గా కూడా పరిగణిస్తారు. ఇక్కడ శక్తిని “గండకి చండీ“ గా పిలుస్తారు. సతీ దేవి “నుదురు” ఇక్కడ పడిందని నమ్ముతారు
ఈ “ముక్తినాథ్” క్షేత్రం అత్యంత పురాతన స్థలం. “వైష్ణవులు” ఈ ముక్తినాథ్ కేత్రాన్ని,“స్వయంవ్యక్త” “అష్ట(8)విష్ణు క్షేత్రాల”లో ఒకటిగా పరిగణిస్తారు.(మిగిలిన ఏడు-శ్రీరంగం,Srimushnam, తిరుపతి, నైమిశారణ్యం,తోతాద్రి,పుష్కర్, బద్రినాథ్ లు)
ఈ ఆలయం చాలా చిన్నది. గర్భాలయం లోవున్న “శ్రీ మూర్తులు” బంగారంతో చేయబడి,అత్యంత సుందరంగా వుంటాయి.భక్తులు ఈఆలయ ప్రాంగణం లోని “108 గోముఖాల” ద్వారా ప్రవహించే పవిత్రమైన “పుష్కరిణి”లో (చివరకు గడ్డకట్టే ఉష్ణోగ్రతలో కూడా)స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయ దర్శనానికి మార్చ్–ఏప్రిల్ మాసాలు చాలా అనుకూమైన కాలం.జూన్-జూలైలు ఇక్కడ వర్షాకాలం.
“శ్రీ వైష్ణవులు” ఈ క్షేత్రాన్ని “108 దివ్య దేశం” లలో “105 దేశం(క్షేత్రం)”గా పరిగణిస్తారు ఈ 108 “ధార”లనే “108 దివ్య శ్రీ వైష్ణవ క్షేత్ర “పుష్కరిణి” ధారలుగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయ,సాహిత్యం ప్రకారం దీని పూర్వ నామం “తిరు శాలిగ్రామం”. ఇక్కడే వున్న శ్రీ “శాలిగ్రామ” శిలలనే “శ్రీమన్నారాయణ” గా భావించి అంత్యంత భక్తి శ్రధ్ధలతో పూజ చేస్తుంటారు.
ఇది పేరుకు మాత్రం“ వైష్ణవాలయం” అయినప్పటికి, “టిబెట్ బౌధ్దులు” కూడా దీనిని వారి పవిత్రమైన ఒక “గొంప”గా పరిగణించి, హిందువులతో పాటు సమానంగా పూజలు (ఆరాధన) నిర్వహిస్తారు. వారు ఈ ఆలయాన్ని(108 waterspouts) 108 పవిత్ర తీర్థస్థానం స్థలంగా భావిస్తారు.ఈ ఆలయంలో ఒక “బౌద్ధ సన్యాసి మఠం” కూడా వుంది.
ఇంతే కాకుండా, “తాంత్రిక విద్యోపాస”కులకి కూడా ఈ ప్రదేశం, వారికు వున్న “24 తాంతిక విద్య ప్రదేశాల”లో ఒకటిగా నమ్ముతారు. ఈ ఆలయంలో వున్న “విగ్రహ మూర్తి” ని “అవలోకితేశ్వర” అవతారంగా నమ్ముతారు.
ఇన్ని విశేషాలున్నఈ “ముక్తినాథ్” ఆలయ దర్శనం మనందరికీ నిజంగా “ముక్తిని “ప్రసాదిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు ..! మనలో ఎవరికైనా వెళ్ళే వీలైతే ..ఆ ముక్తినాధుని దర్శన తో “జన్మధన్యం” చేసుకుందాం.!!.




1 comment: