ఒకే చోట 108 “కైలాస శివాలయాలు” వెస్ట్
బెంగాల్,బర్ధమాన్ (వర్ధమాన్) జిల్లాలో భాగీరథి నది ఒడ్డున, కోలకతా
నుండి 93km దూరంలో 'ఆలయం నగరం' గా
ప్రాచుర్యం పొందిన “అంబికా కల్న” (అంబికా కాళిని) పట్టణంలో వున్నాయి. దీనినే “నవ కైలాశ ఆలయం”
గా కూడా పిలుస్తారు. ఈ
ఆలయం 18 వ శతాబ్దంలో నిర్మించారు.
ఈ “అంబికా కల్న” పట్టణ మొదటి
ప్రస్తావన 6వ శతాబ్ద గ్రంథాలలో
కనబడుతుంది. ఇది సముద్ర వాణిజ్యానికి
ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. అయితే 18వ శతాబ్దంలో(1809), బర్ధమాన్
మహారాజులు (బర్ధమాన్ పాలకులు) టెర్రకోట శిల్ప సంప్రదాయంలో అనేక
దేవాలయాలు నిర్మించారు. మహారాజా తేజా చంద్ర “బిష్ణుపూర్
రాజ ఎస్టేట్” యాజమాన్యం హక్కులు పొందిన సందర్భంగా ఈ ఆలయాల నిర్మాణం
కావించారు. ఈ దేవాలయాల అంతర్
భాగాల్లో అద్భుతమైన టెర్రకోట శిల్పాలతో రామాయణ, మహాభారతం లోని వివిధ ఘట్టాల(శృంగార,వేట) దృశ్యాలు గోడలపై
చిత్రించబడ్డాయి.
ఈ ఆలయ నిర్మాణం వృత్తాకారం
(Circular Shape) లో వుంటుంది. ఈ ఆలయ “అంతర్
వృత్తం”(Inner circle) లోని శివలింగాలు అన్ని
స్వచమైన తెలుపు పాలరాయితో, ”బాహ్య వృత్తం”(Outer circle)లోని శివలింగాలు
నలుపు రాతితో చేయబడి, పాప-పుణ్యాలకు ప్రతీకలుగా
నిలుస్తాయి.
ఇదే కాకుండా అంబికా కల్నాపట్టణం అందమైన వస్త్రాలు,చీరలకు ఒక ముఖ్యమైన ఉత్పత్తి
కేంద్రం. ఇక్కడ అనేక రైస్
మిల్లులతో, బియ్యం వాణిజ్యంలో ఒక ప్రధాన కేంద్రంగా
అలరారుతోంది. ఇక్కడకు కోలకతా బస్సు స్టాండ్ నుండి
బస్సు ద్వారా కూడా చేరుకోవచ్చు.
కోల్
కతా సందర్శించేవారు తప్పక చూడ వలసిన
ఒక అందమైన ప్రదేశం.!!శుభం భూయాత్.
No comments:
Post a Comment