“భీమ కాళీ శక్తిపీఠం” ఎక్కడవుందో.. ఆ దేవి రూపం, కధ, దేవాలయ సుందర చిత్రాలను చూసి ఆనందించండి..!!
“భీమ కాళీ శక్తిపీఠం” ఇది 51 శక్తిపీఠాలలో ఒకటి. హిమాచల్ ప్రదేశ్ లో Nathpa-Jhakri జలవిద్యుత్ ప్రాజెక్టు సమీపంలో, “సరహన్” అనే చిన్న పట్టణంలో వుంది.ఇది సముద్రమట్టానికి 7,500 అడుగుల ఎత్తులో,న్యూఢిల్లీ నుంచి 564 కిలోమీటర్లు,రాజధాని సిమ్లా నుండి 180 కిలోమీటర్ల దూరంలో వున్న, Bushahar ప్రిన్సియలీ రాష్రంశ్ యొక్క, వేసవి రాజధాని.ఈ పట్టణం ప్రకృతి సౌందర్యానికి ఒక వేదిక. సరహన్ పట్టణానికి సుమారు ఏడు కిలోమీటర్ల దిగువున Satluj నది ప్రవహిస్తూ ఉంటుంది.
ఈ ఆలయ ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. పూర్వం ఈ ప్రదేశంలో రాక్షసులు వుండేవారు. వారు ఇక్కడ వున్న మునులను,ఋషులను వారు ధ్యానం చేసుకునేటప్పుడు చాల బాధ కలిగించేవారు. మునులు,ఋషులు ఆ రాక్షసులను సంహరించటానికి ఒక శక్తిని పంపవలసినదిగా భగవంతుని వేడుకొనగా, వారి అభ్యర్ధనను విన్న భగవంతుడు అక్కడ వున్నఒక ప్రదేశంపై తన దృష్టిని నిలపగా ఆ ప్రదేశంలో ఒక భారీ పేలుడు జరిగింది. వారు ఆ ప్రదేశంలో ఒక చిన్న పసిపిల్లను చూశారు. ఆమె క్రమేనా పెరిగి ఒక మహాశక్తి(భీమ కాళి) గా ఎదిగి, ఆ రాక్షసులను అందరిని సంహరించింది. ఈ మహాశక్తి (భీమకాళీ) భూమిమీద రాక్షస శక్తులను వధించటానికి, వాటి నుండి తమను కాపాడటానికి వుధ్బవించింది అని భక్తులు నమ్ముతారు.
ఈ ఆలయ పరిసర ప్రదేశం లోని వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉండి మండు వేసవిలో కూడా 25 డిగ్రీల మించదు. ఈ ఆలయంను సంవత్సరం పొడవునా సందర్శించవచ్చు. శీతాకాలంలో ఈ ఆలయ పరిసర ప్రదేశాలు చాల చలిగా, మంచుతో కప్పబడి, ఆహ్లాదకరంగా వుంటాయి. ఈ ఆలయ సమీప విమానాశ్రయం సిమ్లాలోని Jubbarhati విమానాశ్రయం.
జీవితంలో ఒక సారైనా తప్పక దర్శించ వలసిన శక్తి పీఠం. శుభం భూయాత్.
No comments:
Post a Comment