Friday 8 August, 2014

Patal Bhuvaneshwar Temple

ముక్కోటి దేవతలు(33 కోట్ల దేవతలు)” నిత్యం ఆరాధించే శ్రీపాతాళ భువనేశ్వర్”(Patal Bhuvaneshwar) దేవాలయం..ఎక్కడుందో ? దేవాలయ కధ చదివి, దేవుని చిత్రాలను చూసి తరించండి..!!
పాతాళ భువనేశ్వర్”(Patal Bhuvaneshwar) దేవాలయం భారతదేశంలో,ఉత్తరాఖండ్ రాష్ట్ర,పితోర్ ఘర్ జిల్లా (గంగోలిహాట్ నుండి 14 కి.మీ.దూరంలో)గలభువనేశ్వర్గ్రామములో ఉంది. ఇది ఒకసున్నపురాయి (Limelite) భూగర్భ గుహ. స్థానిక జానపద, పురాణ కధనాల ప్రకారం భూగర్భ గుహలో శివుడు, మరియు ముప్పై మూడు కోట్ల దేవతల కొలువుతీరి వుంటారు.
సున్నపురాయి భూగర్భ ప్రవేశద్వారం నుండి 160 మీటర్ల పొడవు,90 అడుగుల లోతులో, లోపల 1 కిలోమీటర్ విస్తరించి ఉండి, వివిధ రకాల రంగులలో (స్టాలక్టైట్(stalagtite),స్టాలగ్మైట్(stalagmite)) అద్భుతమైన వివిధ రూపాల ఆకృతులలో భక్తులను, చూపరులను విచిత్రాను భూతికి గురి చేస్తుంది. గుహ మొదటగా ఒక ఇరుకైన సొంరంగ ద్వారంతో ప్రారంభమై, లోపల అనేక అంతర్ గుహల సముదాయానికి దారితీస్తుంది. గుహ పూర్తిగా నీటి ప్రవాహం ద్వారా నిండివుండి, విద్యుత్ కాంతులతో ప్రకాశిస్తూ చూపరులను పర లోక భ్రాంతిని కలిగిస్తూ వుంటుంది. గుహ లోపలకు ఇనుప గొలుసులు పట్టుకొని నేల మట్టానికి 90 అడుగుల లోతుకి దిగాలి. లోపల ప్రయాణం చేయటానికి టార్చ్ లైట్లను భక్తులు తమ వెంట తీసుకు వెళ్లతారు.
పురాణాల కధలు ప్రకారం, త్రేతా యుగ సమయంలో అయోధ్యను పాలిస్తున్న,సూర్యవంశం రాజు అయిన ఋతుపర్ణ (Ritupurna) మహారాజు గుహ కనిపెట్టిన మొదటి మానవుడు. గుహ కథ ఋతుపర్ణ మహారాజు మరియు నల మహారాజుతో మొదలవుతుంది. ఒకప్పుడు నల మహారాజు,అతని భార్య అయిన దమయంతి చేతిలో ఓడిపోయాడు. తన భార్యచే విధించబడిన కారాగార వాసం నుండి తప్పించుకోవడానికి తనిని దాచమని ఋతుపర్ణ మహారాజుని అభ్యర్థించినట్లు, ఆయన నల మహారాజుని హిమాలయాలలో గల అరణ్యాలలో ఉండమని కోరినట్లుగా, నలుడు అరణ్యంలో ఒక జింక ను చూసి ఆకర్షితుడయ్యి, దానిని కనుగొనేందుకు వెళ్ళుతూ, ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నట్లు, ఆయనకు ఒక కల వచ్చి దానిలో జింక అతనిని తన కోసం వెదక వద్దన్నట్లు, తను మేల్కొని అక్కడే వున్నా ఒక గుహ వద్దకు వెళ్ళగా, గుహ వద్ద వున్న రక్షక భటుడు నలుని గురించి అడిగి,లోపల వెళ్ళటానికి అనుమతిస్తాడు.
అనుమతిని పొందిన నల మహారాజును, గుహ కుడి ప్రవేశద్వారం వద్ద, శేషనాగు( Sheshnag) తన పడగపై కూర్చున పెట్టుకొని, అతనికి లోపలమహాశివుడు” 33 కోట్ల దేవతల,దేవుళ్ళతోకైలాసంలో వలేకొలువు తీరి వున్న అద్భుతమైన దృశ్యాన్ని చూపుతుంది.
నల మహారాజు పర్యటన తర్వాత గుహ పూర్తిగా మూసుకుని పోతుంది.
అది కలియుగంలోనే మరల తెరవబడుతుంది అనిస్కంద పురాణంలోమానస ఖండంలో లిఖించ బడింది.
అలా ఉటంకించబడిన విధంగానే, కలియుగంలో శ్రీ శంకరాచార్యులు తన హిమాలయాల పర్యటన సందర్భంగా 1121 A.D లో గుహను తిరిగి కనుగొన్నారు. అప్పటి నుండి గుహలో గల శ్రీపాతాళ భువనేశ్వర్సన్నిధానంలో నిత్య ఆరాధనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. అలా కనుగొన బడిన గుహలో ఆది శంకరాచార్యుని కాలం నుండి ఇప్పటి వరకు 20 తరాల (Bhandaris) పూజారి కుటుంబం వారు క్రమం తప్పకుండా పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గుహను సందర్శించే భక్తులకు వీరు పవిత్ర స్థలం గురించి పూర్తి సమాచారంను అందచేస్తుంటారు.
పాడవులుస్వర్గారోహణంకి ముందుగా గుహలోని శ్రీపాతాళ భువనేశ్వర్ని పూజించారని అంటారు. గుహనుండికైలాస పర్వతానికి మరియుచార్ ధామ్లకు భూగర్భమార్గం వున్నట్లు చెపుతారు. గుహలోని మహాశివుని దర్శనంచార్ ధాంయాత్రతో సమానమైనదని భక్తులు భావిస్తారు.
మీకు అవకాశం వస్తే తప్పకుండాపాతాళ మహా శివునిదర్శించి ఆశీర్వాదాలు పొందండి..!! శుభం భూయాత్


No comments:

Post a Comment