Friday 8 August, 2014

భ్రమరి శక్తి పీఠం

భ్రమరి”(బంబుల్బీ) శక్తి పీఠం భారత దేశంలోని వెస్ట్ బెంగాలు రాష్టంలో,జల్ పాయిగురి జిల్లాలోసల్ బరి”( Shalbari) గ్రామంలోతిష్ఠనది ఒడ్డున వున్నది. వాస్తవానికి ఇది బంగ్లాదేశ్ లో రాజ్షహి విభాగం, పంచఘర్ జిల్లా, బోడా ఉప జిల్లాలోని భారతీయ భూభాగంగా ఉంది. అందుచేత దీనిని భారతదేశం యొక్క జల్పాయిగురి జిల్లాలోని ఒక భాగంగా పరిగణిస్తున్నారు. శక్తి పీఠం జల్ పాయి గురి లోని “Jalpesh” దేవాలయం దగ్గర వున్నదని చెపుతారు.
ప్రదేశంలో సతీదేవివెడమ పాదంపడినదని కధనం. పాదానికే పూజాభిషేకాలు నిర్వహిస్తున్నారు. రూప దర్శనం కోసం గర్భగుడిలోదేవి విగ్రహంఒకటి ఏర్పాటు చేసారు.
భక్తులు శక్తి పీఠం తో పాటు “Jalpesh” దేవాలయం లోని శ్రీజల్ పేశ్వర స్వామి, శ్రీ సిద్దేశ్వరీ దేవిలను కూడా దర్శనం చేసుకొంటారు.
“Jalpesh” దేవాలయంలో విశేషమేమంటే, శ్రీ జల్ పేశ్వర స్వామి వారు సుమారు “6 అడుగుల లోతు నీటిలోవుండి భక్తులకు దర్శనమిస్తారు.
ఇక స్థల పురాణాల ప్రకారం, ఒకసారి ప్రదేశంలోఅరుణఅనే అసురుడు నివసించేవాడు. వాడు స్వర్గం మీద దండెత్తి అక్కడ నుంచి దేవతలను తరిమి వేసి తన సామ్రాజ్యన్ని విస్తరించాడు. అప్పుడు దేవతలు, వారి భార్యలు పరమేశ్వరీ దేవిని వేడుకొన్న ఫలితంగా, పరమేశ్వరీ దేవి ఒక పెద్దతేనెటీగసమూహంగా మారి రాక్షసుని, వాని పరివారాన్ని మరణించే వరకు కుట్టింది. తరువాత దేవతలు, వారి భార్యలు తమను రాక్షసుని బారి నుండి కాపాడినందుకు దేవికి కృతజ్ఞతలు తెలిపారు. అందువలన దేవిని 'భ్రమరిదేవి' అని, ”భ్రమరి శక్తి పీఠంఅని భక్తులు పిలుస్తారు.

మీరు శ్రీభ్రమరి”(బంబుల్బీ) శక్తిపీఠ దర్శనం చేసుకొని తరించండి..!! శుభం భూయాత్.



No comments:

Post a Comment