Friday 8 August, 2014

త్రిపురసుందరి శక్తిపీఠం

త్రిపురసుందరి శక్తిపీఠంత్రిపుర రాష్ట్రంలో, ఉదయపూర్అగర్తల (55 కి.మీ) మార్గంలో,అగర్తలా పట్టణం నుండి దక్షిణ దిశగా 3 కి.మీ.దూరంలో ఒక చిన్న గుట్టపై, వంగదేశ గోపుర నిర్మాణ శైలిలో (శంఖమును పోలి చతురశ్రాకార గర్భ గుడిలో) ఉంటుంది.
దీనిని క్రీ.. 1501 లో మహారాజా ధన్య మాణిక్య దేవ్ నిర్మించాడు. క్రీ.. 1681 లో మెరుపుల (lightning) వల్ల దెబ్బతిన్న ఆలయాన్ని మహారాజా రామ మాణిక్య, అటు తరువాత శతాబ్ద ప్రారంభ కాలంలో మహారాజా రాధ కిషోర్ మాణిక్యలు మరమ్మతులు చేయించారు.
త్రిపుర సుందరి దేవినే “Matabari” (మా కాళి/ Soroshi) అని కూడా ఇక్కడి ప్రజలు పిలుస్తారు. ఆలయం లోపల రెండు దేవీ విగ్రహాలు ఉన్నాయి. ఒకటి శ్రీత్రిపుర సుందరివిగ్రహం 5 అడుగుల ఎత్తు ఉంటుంది. మరొకటిఛోటీ మా” (Chhotima) విగ్రహం 2 అడుగుల ఎత్తులో ఉండి ఒక విధమైన ఎరుపు-నలుపురంగు‘kasti’రాయితో తయారుచేయ బడి వుంటుంది. మహారాజు ఛోటీ మా విగ్రహాన్ని యుద్ధ సమయాల్లో తన వెంట తీసుకు వెళ్ళేవాడని చెబుతారు.
ఇక్కడ విశేషమేమంటే, ఆలయ ప్రాంగణంకూర్మ”( తాబేలు) రూపం పోలి వుంటుంది. కనుక ఆలయాన్నికూర్మ పీఠంఅని కూడా పిలుస్తారు. ప్రదేశంలో సతీ దేవికుడి పాదంపడినదని పురాణ కధనం.
ఇతిహాసం ప్రకారం 15 శతాబ్దం చివరి సంవత్సరాలలో త్రిపురను పాలించిన Dhanya manikya రాజు, ఉదయపూర్ పట్టణం సమీపంలోని కొండ మీద వున్నఆలయంలో త్రిపురసుందరి దేవత ను ప్రతిష్టించమని అతనికి ఒక రోజు మహారాజుకు వచ్చిన కలలో దైవాజ్న(దైవవాణి) అవుతుంది. కాని ఆలయమలో అప్పటికే విష్ణుమూర్తిని ప్రతిష్టించి నందున, ఆయన సరసన శివుని భార్య విగ్రహాన్ని ఎలా ప్రతిష్టించాలో నిర్ణయం చేయలేక అయోమయానికి గురిఅవుతాడు. అయితే మరునాడు కూడా కలలో దైవాజ్న అవగా మహారాజు ఆదేశాన్ని శిరసావహించి దేవి విగ్రహాన్ని అందులోనే ప్రతిష్టింప చేసాడు. పురాణ కధనం వైష్ణవ, శైవ భక్తుల మధ్య సయోధ్యను గుర్తుకుతెస్తూ ఉదాహరణగా చరిత్రలో శాశ్వతంగా నిలిచింది.
ఆలయ ప్రాగణంలో తూర్పు వైపు ప్రసిద్ధ కళ్యాణ్ సాగర్ అనే పెద్ద కోనేరు ఉంది ఉంది .దీనిలో వున్న చేపలు,భారీ తాబేలులకు భక్తులు బియ్యం (మురి)అటుకులు,బిస్కెట్లు వాటికి ఆహారంగా వేస్తారు. సరస్సులో చేపలు పట్టడం నిషేదించబడింది.
దీపావళి ఇక్కడ ముఖ్యమైన పండుగ. ప్రతి సంవత్సరము దీపావళి రోజునమేళాజరుగుతుంది. మేళాను రెండు లక్షల కంటే ఎక్కువ దేవి భక్తులు సందర్శిస్తారు ఇది ఆలయ సమీపంలో జరుగుతుంది.
శ్రీ త్రిపురసుందరి దేవికి మరొక ఆలయం ,చెన్నై సమీపంలో Tambaram- selaiyur camp రోడ్డులో (చెన్నై విమానాశ్రయం నుండి సుమారు 15 కిమీ) “Madambakkam” వద్ద ఉంది

శ్రీ త్రిపురసుందరి దేవి రూపం, దేవాలయ సుందర చిత్రాలను చూసి తరించండి...!! శుభం భూయాత్.


No comments:

Post a Comment