Friday 8 August, 2014

మణి మహేష్ కైలాష్

మహా శివుని రెండవ నివాసం - కైలాస-మానస సరోవర సమానంఅయినమణి మహేష్ కైలాష్యాత్రా ప్రదేశం గురించి.. ?
మణి మహేష్ కైలాష్శిఖరం భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర Budhil లోయలో,చంబా జిల్లా భార్మౌర్ ఉపవిభాగంలో, భార్మౌర్ నుండి 26 kilometres దూరంలో, 18,547 అడుగుల ఎత్తులోమణి మహేష్ సరస్సువద్ద ఉంది. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని ప్రధాన యాత్రా ప్రదేశాలలో ఒకటి. దీనినేచంబా కైలాష్శిఖరం అని కూడా అంటారు. (“మణి మహేష్అనగా మహా శివుని(మహేష్) జటాజూటంలోని మణి).
మణి మహేష్ సరస్సునిదాల్ లేక్అని కూడా పిలుస్తారు. సరస్సుకు టిబెట్ లోనిమానస సరోవరంఅంత ప్రాముఖ్యత కలిగివుంది.
ప్రదేశంలో ఉదయ సమయంలో సూర్యుని కిరణాలు మణి మహేష్ శిఖరాగ్రం పై పడి పరావర్తనం చెందిమణివలె దివ్యకాంతులను విరజిమ్ముతూ వివిధ స్పష్టమైన రూపాలను (చంద్ర,నాగాభరణ,గణేష్) సంతరించుకుంటాయి. దీనినేమణి దర్శన్అని పిలుస్తారు. వీటిని ప్రత్యేకించి పూర్ణిమ రాత్రులందు స్పష్టంగా చూడవచ్చు. రూపాలను వీక్షించటం భక్తులు తమ జీవితాల్లో ఒక అరుదైన అదృష్టంగా భావిస్తారు.
శిఖరం శివునిరెండవ నివాసంగా హిమాచల్ ప్రదేశ్ ప్రాంత ప్రజలు (ముఖ్యంగా Gaddi తెగ వారు) విశ్వసిస్తారు. “భదోన్నెలలో అమావాస్య తరువాత ఎనిమిదవ రోజున సరస్సు ఒడ్డున మహోత్సవాలు జరుగుతాయి. రోజున వేలాది మంది భక్తులు పాల్గొనటం జరుగుతుంది.
మణి మహేష్ కైలాష్ శిఖరాగ్రాన్ని పర్వతారోహకులు ఎవరు కూడా ఇంతవరకు విజయవంతంగా అధిరోహించ లేకపోయారు. ఒక ఇండో జపనీస్ జట్టు 1968 లో,నందిని పటేల్ నేతృత్వంలో శిఖరం అధిరోహించటానికి చేసిన ప్రయత్నాన్ని శివుని పరమ భక్తులైన వారిచే మధ్యలోనే నిలిపి వేయబడింది. అందుచేత ఇప్పటికీ శిఖరాన్ని ఎవరూ అధిరోహించాటానికి సాహసం చేయలేదు.
మణి మహేష్ శిఖరం, సరస్సు యొక్క పవిత్రత గురించిన అనేక పౌరాణిక ఇతిహాసాలు ఉన్నాయి. అట్టి వాటిలో గల ఒక ప్రముఖ పురాణంలో, మహాశివుడు పార్వతిని పరిణయ మాడిన తరువాత మణి మహేష్ పర్వతాన్ని సృష్టించాడు.
ఇక ప్రాంతంలో సంభవించే హిమ పాతం మరియు మంచు తుఫానులు ద్వారా పరమశివుడు తన అసంతృప్తిని/
రౌద్రాన్ని ప్రదర్శిస్తాడని ఇతర పురాణాలు వివరించినట్లు ఉన్నాయి.
పురాణ కధనం ప్రకారం శివుడు ఇక్కడ అనేక వందల సంవత్సరాలు తపస్సు ఆచరించగా నీరు ఆయన జటాజూటం నుంచి బయటకు వచ్చి సరస్సు రూపం దాల్చి రెండు వేర్వేరు భాగాలుగా ఏర్పడింది. పెద్ద భాగం 'శివ Karotri' (శివ స్నానం ప్రదేశం) అని, చిన్న భాగం చల్లని మంచు నీరుతో కన్పించని మోస్తరు నీటితో 'గౌరీ కుండ్' గా ఏర్పడిందని అంటారు. అందువలన, పురుషులు మరియు మహిళలు సరస్సు యొక్క వివిధ ప్రాంతాలలో స్నానం చేస్తారు. ఇక్కడి స్థానికంగా పిలవబడే ఆచారాల (naun) ప్రకారం, సరస్సులో ఒక్కసారి మాత్రమే స్నానం చేయాలా లేదా నాలుగు సార్లు అనేది నిర్ణయం చేయబడుతుంది.
ఇప్పుడు సరస్సు ఒడ్డున (పంచలోహం,పాలరాయితో చేసిన శివుని విగ్రహాలు ఏర్పాటు చేశారు.. పాలరాతి విగ్రహాన్ని “Chaumukha”(చౌ-నాలుగు,ముఖ-ముఖములు) అంటారు. సరస్సు యొక్క ఒడ్డునే ఒక చిన్న దేవాలయం కూడా ఉంది.“లక్ష్మిదేవిపంచలోహ విగ్రహం ప్రతిష్టించారు. దేవినే వీరుమహిషాసుర మర్ధనిఅని పిలుస్తారు.ఇప్పటికీ కలుషితం కాకుండా వున్న సరస్సు మరియు దాని పరిసరాలు, సరస్సులో ప్రతిబింబించే మణి మహేష్ శిఖర సౌందరం భక్తులను కట్టిపడేస్తుంది.

మీరూ మణి మహేష్ శిఖరం, సరస్సు సుందర చిత్రాలను చూసి ఆనందించి, తరించండి..!! శుభం భూయాత్.


No comments:

Post a Comment