Friday 8 August, 2014

శ్రీ ఆంజనేయస్వామి వారి దేవస్థానం, కోళ్ళూరు

శ్రీ ఆంజనేయస్వామి వారి దేవస్థానం, కోళ్ళూరు
కోళ్ళూరు... ప్రఖ్యాతకోహినూర్‌’ వజ్రం దొరికిన ప్రదేశం... ఇప్పటికీ ఇక్కడి నదిలో వజ్రాల కోసం స్థానికులు వెదుకుతూనే వుంటారు.
కృష్ణానది ఒడ్డునే... దట్టమైన అడవుల్లో కొలువై వుండి కోరిన కోరికలను నెరవేర్చే అత్యంత శక్తివంతమైన మహిమాన్వితుడు శ్రీ కోళ్ళూరు ప్రసన్నాంజనేయ స్వామి... గ్నుంటూరు జిల్లా, బెల్లంకొండ మండలం, కోళ్ళూరు దగ్న్గర, గొల్లపేటలో కొలువై వున్నారు. ఈయన కోళ్ళూరు ఆంజనేయస్వామిగానే ప్రసిద్ధి.
చరిత్ర : పూర్వకాలంలో ఒక గ్న్రుడ్డి, ఒక చేయి లేని వికలాంగ్నుడు అమ్మ తిట్టిందని ఊరి బయటికొచ్చి కోపంతో ఒక రాయిని చెక్కుతాడు. అలా చెక్కిన విగ్న్రహమే శ్రీ ఆంజనేయస్వామి వారిగా మారుతుంది. విగ్న్రహంలో నుంచి శ్రీ ఆంజనేయస్వామి వచ్చి అంధుడితో నన్ను ఎవరూ చూడకుండా నది వరకు తీసుకెళ్ళమని చెబుతాడు. ఎవరైనా చూస్తే నీవు అక్కడికక్కడే చనిపోతావు అంటాడు. ఇలా విగ్న్రహంతో వికలాంగ్నుడు నడుస్తుండగా ఇంతలో వికలాంగ్నుడి తల్లి పిలవడంతో... వికలాంగ్నుడు అక్కడికక్కడే చనిపోతాడు. ఆంజనేయస్వామి శిలగా మారిపోతాడు. మారిన ప్రదేశమే గొల్లపేట.
రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారితో ముఖాముఖి : కోళ్ళూరు శ్రీ ఆంజనేయస్వామి వారు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారితో స్వయంగా మాట్లాడారని చెబుతారు. రాజావారు ఆంజనేయస్వామి వారిని నిన్ను అమరావతి తీసుకెళతాను.. రా... ఇక్కడుంటే నీకు ధూపదీప నైవేద్యం కూడా ఉండదు... అడవుల్లో సెంటు భూమి కూడా లేని నీవు విధంగా వుంటావు... ఎవరితో పూజలందుకుంటావు... అంటే అందుకు స్వామి వారు నేను రాను.. ఇక్కడే వుంటాను... అని సమాధానమిచ్చారని చెబుతారు.
సెంటు భూమి కూడా లేని శ్రీ ఆంజనేయస్వామి వారు 100 ఎకరాలువున్న మిగ్నతా దేవాలయాల కంటే అన్ని విధాల అగ్న్రగామిగా వున్నారని చెప్పవచ్చు.
ప్రతి సంవత్సరం సమీప గ్రామాల ప్రజలు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి మాలలు ధరించి మొక్కులు చెల్లించుకుంటారు.
ప్రస్తుతం గ్రామం/తండా పులిచింతల ముంపు ప్రాంతం కావడంతో... శ్రీ స్వామి వారిని బెల్లంకొండ అడ్డరోడ్డు దగ్న్గర నూతనంగా గ్నుడి నిర్మాణంచేసి అక్కడకు మారుస్తున్నారు.
దారి : గ్నుంటూరు, సత్తెనపల్లి, రాజుపాలెం మీదుగా బెల్లంకొండ అడ్డరోడ్డుకు చేరుకుని అక్కడి నుండి సుమారు 40 కిమీటర్లు లోపలికి వెళ్ళాలి. సరిjైున రోడ్డు వుండదు. అంతా రాళ్ళతో నిండిన రహదారి, 40 కిలోమీటర్లు నీళ్ళుగాని, ఆహారం గాని ఏమీ దొరకదు. పులిచింతలకు వెళ్ళే బస్సు రోజుకు రెండుసార్లు తిరుగ్నుతుంది. అంతా అడవిలో ప్రయాణం కాబట్టి సాధ్యమైనంతవరకు పదిమందితో కలిసి బయలుదేరితో మంచిది. దారి తెలిసిన వాళ్ళు వుంటే బాగ్నుంటుంది... ఎందుకంటే అడవిలో దారులన్నీ ఒకేలాగా వుంటాయి...


No comments:

Post a Comment