Friday 8 August, 2014

శ్రీ జ్వాలాముఖి శక్తిపీఠం

శ్రీజ్వాలాముఖి శక్తిపీఠంఎక్కడవుందో.. దేవి రూపం, కధ, దేవాలయ సుందర చిత్రాలను చూసి ఆనందించండి..!!
శ్రీజ్వాలాముఖి శక్తిపీఠపుణ్యక్షేత్రం హిమాచల్ ప్రదేశ్, శివాలిక్ శ్రేణి లోయలో, దక్షిణ కాంగ్రాకు 30 Km, ధర్మశాల నుండి 70 కిలోమీటర్ల దూరంలోజ్వాలాముఖిపట్టణంలో ఉంది.
ఇక్కడ సతీ దేవినాలుకపడినదని పురాణ కధన నమ్మకం.
జ్వాలాముఖి శక్తిపీఠ విశేషమేమంటే, దేవి నిరంతరం మండుతున్నజ్వాలగాజ్వాలారూపంలో మనకు దర్శనమిస్తుంది. అందువల్ల ఆలయంజ్వాలాముఖిశక్తిపీఠంగా పిలవబడుతోంది.
ఈఆలయ ప్రాంగణంలోనే మరితొమ్మిది పవిత్ర జ్వాలలువివిధ దేవతాశక్తి (మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక,అంజనదేవి,అన్నపూర్ణ,చండి,హింగ్లాజ్ భవాని, వింధ్యా వాసిని) నామాలతో పిలవబడుతూ ఆలయంలో దర్శనమిస్తాయి.
ఆలయ గోపురం అక్బర్ చక్రవర్తి కాలంలో బంగారంతో చేయబడిందని చరిత్ర ఆధారంగా తెలియవస్తోంది. శుభం భూయాత్.


No comments:

Post a Comment