Friday 8 August, 2014

హర సిద్ధి శక్తిపీఠం

హర సిద్ధి శక్తిపీఠంమధ్యప్రదేశ్ లోని పురాతన ఉజ్జయినీ నగరంలో, శ్రీమహాకాళేశ్వర జ్యోతిర్లింగపవిత్ర క్షేత్రం సమీపంలో వుంది.. శక్తిపీఠం “Kapilambara” శక్తిపీఠంగా కూడా పిలవబడుతోంది. హరసిద్ధి దేవి, మహాలక్ష్మి, మహాసరస్వతి విగ్రహాలు మధ్య అన్నపూర్ణ దేవిగా భక్తులచే కొలవబడుతోంది.
స్ధల పురాణం ప్రకారం ఒకసారి చండ-ప్రచండ అనే ఇద్దరు రాక్షసులు దేవతల నందరిని జయించి చివరకు కైలాసం మీదకు కూడా దండెత్తుతారు. సమయంలో శివుడు పార్వతిదేవితో చదరంగం ఆడుతుంటాడు. రాక్షసులు అక్కడే వున్ననందిని జయించి కైలాసాన్ని అంతటిని నాశనం చెయ్యబోగా,శివుడు అది పరాశక్తిని ధ్యానం చేస్తాడు. ఆమెహర సిద్ధిరూపంలో ప్రత్యక్షమై రాక్షసులను మట్టుపెట్టినదని కధనం. హర సిద్ధియే “Tripurantaka” శక్తిపీఠంగా కూడా వర్ణించబడింది. ఆమె శివునికి త్రిపురాసులరలను చంపడానికి ధైర్యం ఇచ్చినమంగళ చండిగా పిలవబడుతూ, పూజించబడుతోంది
శివ పురాణం ప్రకారం, సతీదేవిమోచేయి ప్రదేశంలో పడిందని అంటారు. తాంత్రిక సంప్రదాయంలో ఇది ఒకసిద్ధ పీఠంగా పేర్కొనబడింది. హరసిద్ధి దేవినే శ్రీ విక్రమాదిత్యుడు పూజించేవాడని చరిత్ర చెపుతోంది. ఆలయంలోనే శ్రీ యంత్రం కూడా ప్రతిష్టించారు. గర్భగుడిలో ముందు హాల్ పైభాగంలో 50 శక్తిపీఠ చిత్రాలతో అందంగా చిత్రీకరించారు.
ఆలయం మరాఠా(మరాట్వాడ)రాజుల కాలంలో పునర్నిర్మిచబడింది. దేవాలయం ముంది భాగానతైల దీపాలనువెలిగించటానికి, రెండు పొడవైనదీపస్థంభాలుకూడా ఏర్పాటుచేశారు. స్థంభాలు మరాఠాదేశ కళా వైభవానికి తార్కాణాలు. వీటిని నవరాత్రి పర్వదినాలలో వెలిగించుతారు.
“Harsiddhi/chandi,Ujjain shakti petham Live Darshan “http://117.240.185.20/index.html

మీరూ ఉజ్జయినిలోని శక్తిపీటాన్నిదర్శించి,.జన్మ ధన్యం చేసుకోండి.!! శుభం భూయాత్.


No comments:

Post a Comment