Friday 8 August, 2014

చింతా పూర్ణి దేవి శక్తి పీఠం

చింతా పూర్ణిలేదాఛిన్న మస్తిక” (Chinnamastika/Chinnamasta) దేవి శక్తి పీఠం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో యునా జిల్లాలో (పంజాబ్ రాష్ట్రం సరిహద్దు) Chintpurni-177110 లో వున్నది.
చింతా పూర్ణి” (చింత అనగాకోరిక’- పూర్ణి అనగానెరవేర్చే’) దేవిని Chinnamastika/Chinnamasta పేరుతో కూడా పిలుస్తారు. దేవి విగ్రహరూపంలో కాకుండాశిరస్సు” (తల) రూపంలో భక్తులచే పూజించబడుతుంది.
ఛిన్నఅనగాతెగిన” - “మస్తికఅనగాతల”, “తల త్రెంచబడినదేవి అని అర్ధం. పుణ్యక్షేత్రం 51 శక్తి పీఠాలలో ఒకటి.
మార్కండేయ పురాణం ప్రకారం, చండి దేవత తీవ్ర యుద్ధం తర్వాత రాక్షసులను ఓడించినా తన ప్రతిరూపాలు అయిన జయ,విజయల రక్త దాహం తీర్చటానికి తన తలనే ఖండించుకుని వారి కోరికను తీర్చినట్లు కధనం.
దేవిఛిన్న మస్తికరూపంలో త్రెంచబడిన తన తలను ఒక చేతిలో పట్టుకొని, మెడనుడి ఉబుకుతున్న రక్త ధారతో, మరొక వైపు రక్తప్రవాహాన్ని త్రాగే తన ప్రతిరూపాలతో భక్తులకు దర్శనమిస్తుంది.
Chhinnamasta దేవి, తలలేని దేవతా రూపంలో, తనను హృదయపూర్వకంగా,అంకితభావంతో నమ్మి కొలిచే భక్తులకు త్యాగభావం,మోక్షాన్నిప్రసాదిస్తుంది. తలను ఖండించుకోవటం (శరీరం నుండి వేరు చేయటం) అనేది భౌతిక స్పృహ (శరీరం) పరిమితుల్లో నుండి స్వేచ్ఛ (మనస్సు) వేరు చేయటంగా సూచిస్తుంది. కోరికలు తీరిన భక్తులు ఇక్కడకు వచ్చి అక్కడే వున్నచెట్టుకు ఎర్రటి వస్రం (మొక్కుతీరుచుకున్నట్లు) కట్టుతారు.
క్షేత్ర పౌరాణిక సంప్రదాయాలు ప్రకారం, “ఛిన్న మస్తికదేవి నాలుగు దిశలలో (తూర్పున-కాళేశ్వర్ మహదేవ్, పశ్చిమాన-నారాయ్హన మహదేవ్,ఉత్తరాన-ముఖంద్ మహాదేవ,దక్షిణాన-శివ బారి) శివుని (రుద్ర) ద్వారా రక్షించబడుతుంది. నాలుగు శివాలయాలు చింతాపూర్ణి నుండి దాదాపు సమాన దూరాలలో ఉన్నాయి. క్షేత్ర సంప్రదాయాలలో కూడా చింతాపూర్ణి దేవియేఛిన్న మస్తికఅని నిర్ధారించాయి.

దేవి రూపం, దేవాలయ సుందర చిత్రాలను చూసి తరించండి..!! శుభం భూయాత్.


No comments:

Post a Comment