Friday 8 August, 2014

త్రిపురమాలిని (జలంధర) శక్తిపీఠం

త్రిపురమాలిని (జలంధర) శక్తిపీఠంఎక్కడవుందో.. దేవి రూపం, కధ, దేవాలయ సుందర చిత్రాలను చూసి ఆనందించండి..!!
త్రిపురమాలిని శక్తిపీఠంపంజాబ్ రాష్ట్రంలో,జలంధర్ జిల్లా,Chawani స్టేషన్ సమీపంలో Devi Talab Mandir, Pathankot Road, Shiv Nagar, Industrial Area, Jalandhar, Punjab 144008 లో ఉంది.
ఇక్కడ సతీదేవి రొమ్ము పడిందని పురాణ కధనం. ఆలయంలో సతీదేవిస్తనమూర్తిగా”, పైఎదభాగం వస్త్రంచే పూర్తిగా కప్పబడి, కేవలంముఖభాగంగా మాత్రమే దర్శన మిస్తుంది. ఇక్కడ సతీదేవి Tripurmalini పేరు మీద భక్తులచే పూజించ బడుతోంది.
శక్తిపీఠం వాస్తవానికి “Devi Talab Mandir” కు ఒక వైపు వుంది. దేవితలాబ్ మందిర్ లో లక్ష్మీ, సరస్వతీదేవి విగ్రహాలతో పాటు వైష్ణో దేవి మాత విగ్రహాన్ని కూడా చూడవచ్చు. ఆలయాన్ని కూడా కలిపిత్రిపురమాలిని శక్తిపీఠంగా ఇక్కడి భక్తులు పిలుచుకుంటారు.
మరి కొందరు భక్తులు ప్రకారంత్రిపురమాలిని శక్తిపీఠంగుజరాత్ రాష్ట్రంలో, బనస్కాంత జిల్లాలో ఉన్న ప్రసిద్ధఅంబాజీ ఆలయంఅంటారు. ఇది గుజరాత్ మరియు రాజస్థాన్ సరిహద్దు సమీపంలో అబూ రోడ్ నుండి (మౌంట్ అబూ నుండి 20 కిలోమీటర్ల) 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శ్రీ త్రిపురమాలిని దేవిని మీరు దర్శించి ఆమె కటాక్షం పొందండి. శుభం భూయాత్.



No comments:

Post a Comment