Tuesday 12 August, 2014

శ్రీ “కపాలి (విభాసా)”శక్తి పీఠం

శ్రీకపాలి (విభాసా)”శక్తి పీఠం - “బర్గోభీమ దేవిఆలయం(Bargabhima Temple-Devi Barghobhima ) గా పిలవబడుతూ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో, పూర్వ మేదినీపూర్(Purba Medinipur-East Midnapur) జిల్లాలోతమలుక్”(Tamluk)పట్టణంలో వున్నది. దీనిని 1150 సంవత్సరాల క్రితం మయూర్ రాజ వంశ మహారాజులు నిర్మించిన Bhargabhima ఆలయం చెక్కినది దైవశిల్పి విశ్వకర్మదని విశ్వసిస్తారు. ఇది కోలకతా (కలకత్తా)కు సుమారు 87.2 km,ఖరగపూర్ కు 85 km దూరంలో వుండి, NH-6 కు,south eastern railway లకు అనుసంధానం చేయబడింది.
పురాణ కధనాల ప్రకారం ప్రదేశంలో సతీదేవిఎడమ చీలమండ”(Left Ankle) పడినదని చెపుతారు. ఆలయాన్ని 51 శక్తి పీఠంలలో ఒకటి అని భక్తులు భావిస్తారు. ఆలయాన్ని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంహెరిటేజ్ సైట్గా ప్రకటించింది.
ప్రస్తుత దేవాలయం పురాతనమైనదేమి కాదు. మధ్య యుగం లో బెంగాల్ఇస్లామిక్ ఆక్రమణతరువాత పునర్నిర్మించారు. ఆలాన్ని గురించి సనాతన బెంగాలీ సాహిత్యంలో అనేక మార్లు పేర్కొన్నారు.
దేవాలయము మూడు సాంస్కృతిక (హిందూ,బౌద్ధ,ఒరియా) కలయికలతో అలరారుతూ ఉంటుంది. స్థానిక బెంగాలీలు ఆలయంలో వారి నూతన సంవత్సర వేడుక, దుర్గా పూజలను అత్యంత శ్రద్ధా భక్తులతో ఘనంగా జరుపుకుంటారు.

బర్గోభీమ దేవి ఆశీస్సులు మనందరిపై వుండాలని కోరుతూ..!!శుభం భూయాత్.


No comments:

Post a Comment