Thursday 14 August, 2014

“కామాఖ్యదేవి” శక్తిపీఠం

ముందుగానా మాట !!
నేను, కామాఖ్యాదేవీశక్తిపీఠ వర్ణననుఅతి పవిత్రంగా”, “స్వచ్చమైన మనస్సుతో, “త్రికరణ శుధ్ధిగా, తల్లిపై గలమాతృభావంతో,సాద్యమైనంత వరకుఅసభ్యపదజాలంలేకుండా రాయటం జరిగింది.పీఠవర్ణననా అతి తక్కువభావపటిమకు, “భాష పరిజ్ణానంకు మించినది. నా శక్తికి మించిన దైనా కూడా,దీనిని “3 రోజుల్లోసవివిరంగా మీ ముందుంచటానికి నేను చాలా సాహసమే చేశాను. దయచేసిస్త్రీ మూర్తులైన తల్లులందరు,నన్ను తమ బిడ్డగా భావించి, నాభావ దోషాలనుపెద్ద మనసుతోక్షమించగలరని భావిస్తున్నాను..!
ఇక చదవండి.. !! చూడండి.. !!
శ్రీకామాఖ్యదేవిశక్తిపీఠం భారతదేశంలో,“అసోమ్” (అస్సాం) రాష్ట్రంలోగువాహతి” (గౌహతి) నగర పశ్చిమ భాగంలో, “నీలాచల”(కామగిరి) కొండలలో నెలకొని వున్నది. ఇదిపది మహావిద్య (కాళి,తార,కామాఖ్య,భువనేశ్వరీ,భైరవి,
చిన్నమస్త,ధూమావతి,భగలాముఖి,మాతంగి,కమల) “తాంత్రికదేవాలయాల సముదాయం.!! అయితే వాటిలోత్రిపురసుందరి, మాతంగి, కమలాదేవతలు ప్రధాన ఆలయం లోపల, మిగిలిన దేవతలుఏడుదేవాలయాలలో వుంటారు.
ప్రాచీన సంస్కృత గ్రంధమైనకాళికా పురాణంలో కామాఖ్యదేవిని శివునిచిన్నభార్యగా,ముక్తిప్రదాయిని గా మరియుసకల మనోభీష్టదాయనిగా వర్ణించబడింది. పురాణం ప్రకారం,”సతీదేవి ప్రదేశాన్ని, శివుని కోసం తనప్రణయతృప్తి రహస్యస్థలంగాఉపయోగించినట్లు పేర్కొనబడినది మరియు శివుడు సతీదేవి శవంతో తాండవ నృత్యం చేసినపుడు, ప్రదేశం లోనే ఆమెయోనిపడినట్లు కూడా చెపుతారు.
అయితే రెండు పరస్పర విరుధ్ధ అభిప్రాయాలను,“దేవిభాగవతం లోని “108 శక్తి పీఠప్రదేశాలజాబితాధృవ పరచటం లేదు.
దక్ష యజ్ణానంతరం, శోకతప్తుడైన శివుని చూసి విష్ణువు, ఆయన శోకం పోగొట్టటానికి తనసుదర్శనచక్రంతో సతిదేవిమానవ శరీరంని విచ్ఛేదనం చేసినప్పుడు, సతీదేవిరహస్యాంగమ్”(Private Part) “రెండుప్రదేశాలలో పడిందని, “మొదటిభాగం -“బాహ్యజననాంగాలు” (Outer Parts) అస్సాం రాష్ట్రంలోనిగువాహాతి (గౌహతి) లోకామాఖ్యదేవి ఆలయంవద్ద,“రెండోభాగం -” గర్భాశయం”(Inner Parts)నేపాల్ దేశంలోని కాట్మాండ్ పట్టణంలోభాగమతినది వడ్డున శ్రీపశుపతినాథ్ దేవాలయప్రదేశ ప్రాంతంలో పడిందని ఇతిహాస కధనం..!
కామాఖ్యాదేవి దేవాలయం వేల సంవత్సరాల చరిత్ర కలిగినది. ప్రస్తుత దేవాలయం క్రీ.. 1564-63 సమయంలోకోచ్ వంశపుగొప్ప యోధుడు “Chilarai” ద్వారా 1565 లో నిర్మించబడింది. అసలుకామాపురఆలయంరెండవ సహస్రాబ్దిమధ్యలో ధ్వంసమైంది.
అసలుకామాపుర”(కామాఖ్య)దేవాలయం పదహారవ శతాబ్ద ప్రారంభంలో“Moslem దండయాత్రలో ధ్వంసం చేయబడింది.ప్రస్తుత ఆలయంకూచ్ బీహార్ రాజు నరనారాయణచేత 1565 లో పునర్నిర్మించబడింది.ఆలయంలో ప్రార్థనా కార్యక్రమాల (స్థానిక అర్చకత్వం) కోసం,కోచ్ రాజుగారోస్ జాతిపూజారులను విదేశాల నుండి రప్పించినట్లు తెలుస్తున్నది.మొదట్లో ఈపూజారులు కామాఖ్యాదేవికిపందులను బలి ఇచ్చే సంప్రదాయంగా వుండేది
ఐదవ శతాబ్దానికి ముందునరకుడుఅనే ఒక సాహసికుడుమిథిలానగరం నుండి పురాతన అస్సాంలో తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు.అతడు,తనని యోని-దేవతసంరక్షకుడుగా ప్రకటించుకున్నాడు. బహుశా పరిణామ క్రమంలోనే,తన సామ్రాజ్యఫ్రాక్-జ్యోతిషాపురపేరునుకామాపురగా మార్పుచేసి వుండవచ్చని చరిత్రకారుల భావన.
నరకుడుజయించిన ప్రాంతవాసులుకిరాతకజాతికి చెందిన ప్రజలు.వారు బహుదేహదారుఢ్యులు, అజ్ఞానులు మరియు బొడి తలలతో,” బంగారువర్ణచర్మం కలిగి వుండేవారు.వారికిమద్య,మాంసాలుఆహారపు అలవాట్లుగా వుండేవి.బహుశా కామాపురాదేవి వారికి గాని లేదా వారిలోని కొన్నిఉప తెగజాతులకు చెందినకులదేవతఅయి ఉండవచ్చు.
కామఖ్యాదేవిఆలయం మూడు పెద్ద మండపాలను కలిగిన ఒక సముదాయం.దీనిపశ్చిమదిశమండపందీర్ఘ చతురస్రాకారంకలిగి వుంటుంది. దీనిని సాధారణ భక్తులెవరూ వారి ప్రార్ధనలకు ఉపయోగించరు. మండప గోడలపై, కూచ్ బీహార్ రాజు శ్రీనరనారాయణచెక్కిన చిత్రాలు, సంబంధిత శాసనాలు,ఇతర దేవతా చిత్రాలను కలిగి వుంటుంది.ఇకమధ్యమండపంచతురస్రాకారంలో, చిన్న దేవివిగ్రహం వున్న కూడలి. మధ్య మండపంలో నుండేగుహ రూపంలో వున్నకామాఖ్యాదేవిగర్భగుడిలోనికి దారివుంది. సముదాయంలోని ఇతర ఆలయాలగర్భగుడులుకూడా ఇదేవిధంగా వుంటాయి.
ఇక,అత్యంత పవిత్రమైన కామాఖ్యాదేవీ ఆలయగర్భగుడినేలమట్టమునకు దిగువుకు వుండి,సహజ నీటి(spring waters)ప్రవాహంగల ఒకగుహలో ఉంది. ఇరుకైన గుహలో క్రిందికి నిటారుగా వున్నమెట్ల మార్గంతో ఒకమర్మ(చీకటి)గదిఉన్నది. గదిలో గలశిలా(రాయి)భాగం” –రెండుపిరుదులును పోలి, సుమారు “10 అంగుళాలలోతు చీలిక గలిగి,నిరంతరంనీటిప్రవాహ(యోనిద్రవ)”ధారతో, “స్త్రీ జననాంగ( మంత్ర యోని)” ఆకారంలో,“పట్టువస్త్రం,“పుష్పాలతో అలంకరింపబడి శ్రీకామాఖ్యాదేవిగా మనకు దర్శనమిస్తుంది.
కామాఖ్య దేవతకు జరిగే అతి ముఖ్యమైన పండుగ పేరుఅంబువాసి (అమితే) (సంతానోత్పత్తి)పండుగ”.ఇది మూడు రోజుల పండుగ. ఇది మాత కామాఖ్య భక్తులకు గొప్పతాంత్రిక ఉత్సవం”. “దశ మహావిద్యా,కామాఖ్య సంప్రదాయంప్రకారం, రోజుల్లో దేవిరుతుస్రావంకు లోనవుతుంది. సమయంలో (జూలై నెల) గర్భగుడిలోనిసహజనీరు(ఋతు శ్రవం)” “ఎరుపురంగు”(ఐరన్ ఆక్సైడ్)ను పోలి వుంటుంది. సమయంలో ఆలయంమూడు రోజులుపాటు మూసివేయబడుతుంది. తర్వాతనాల్గవ రోజు గొప్పఅంబువాసిపండుగ ప్రారంభమవుతుంది. మూడు రోజులూ దేవిఋతుక్రమ బాధలో వున్నట్లు భావించి, ఇక్కడి ప్రజలు ఎవరూపొలంపనులు వేటినీ చెయ్యరు.
పండుగే కాకుండా, ఆలయ పూజారులు ఆలయంలో రోజూ సాధారణ పూజా కార్యక్రమాలు,మరియు ఉత్సవాలు కూడా జరుపుతుంటారు. దేవికిజంతుబలిఅతి సామాన్యమైన విషయం. కానీ అన్నిఆడ జంతువులకు మాత్రం మినహాయింపు ఇస్తారు.అలానే ప్రతి సంవత్సరం కూడా శ్రీ దుర్గాదేవి పూజను,“ సెప్టెంబర్అక్టోబర్ నెలలోనవరాత్రులనుఘనంగా జరుపుకుంటారు.
శుభం భూయాత్ !!


No comments:

Post a Comment