Thursday 14 August, 2014

EKKAVEERA SHAKTHIPEETH

సతీదేవికుడి స్తనంపడిన ప్రదేశంగా శక్తి పీఠాన్ని గురించి చెప్పుకుంటారుఇది మహారాష్ట్రకి చెందిన మాహుర పురంలో వుంది. ఏకవీరాదేవి అవతరించిన మాహుర క్షేత్రం దత్తాత్రేయుడి జన్మస్థానంగా ప్రసిద్ధి చెందింది. ఇక ఇక్కడి పీఠంపై కేవలం అమ్మవారి ముఖం (తల భాగం) మాత్రమే కనిపిస్తుంది. అందువలన ఆమెను అంతారేణుకా మాతగా భావించి పూజలు చేస్తుంటారు.
జమదగ్ని మహర్షి తన భార్య రేణుకాదేవి మనసు చెదిరిందని ఆగ్రహించి ఆమె తల తీసేయమని కొడుకైన పరశురాముడిని ఆదేశిస్తాడుతండ్రి మాటను పరశురాముడు శిరసావహిస్తాడు. ఫలితంగా మొండెం నుంచి వేరైన రేణుకామాత తల అక్కడికి దగ్గరలో వున్న గూడెంలో పడుతుందిరేణుకామాత పాతివ్రత్యం గురించి ముందుగానే తెలిసి వుండటం వలన, గూడెం ప్రజలు ఆమె తల పడిన ప్రదేశంలో గుడికట్టి పూజించడం మొదలు పెట్టారుఅలా ఇక్కడి అమ్మవారు పూజలు అందుకుంటోందని భక్తుల విశ్వాసం.

అయితే ఇది రేణుకా మాత ఆలయమేగానీ శక్తి పీఠం కాదనే మాట ప్రచారంలో వుంది. అక్కడికి దగ్గరలోనే అంటే మాహొర్ కి 10 కిలోమీటర్ల దూరంలో అసలైన శక్తి పీఠం ఉందనేది స్థానికుల విశ్వాసం. పొలాల మధ్య చిన్న గుడిలో వెలసిన అమ్మవారి ప్రతిమ కూడా ముఖం వరకు (తల భాగం ) మాత్రమే ఉండటం విశేషం. నిజమైన శక్తి పీఠం ఇదేనని చెప్పే ఆధారాలు ఇక్కడ ఉన్నాయని చెబుతున్నారు. ఏదేవైనా ప్రాంతానికి వెళితే రేణుకా మాత క్షేత్రంతో పాటు అమ్మవారి శక్తి పీఠాన్ని దర్శించిన భాగ్యం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

No comments:

Post a Comment