Thursday 24 July, 2014

Penchala kona Narasimha swamy temple

పెంచల కోన నరసింహ స్వామి ఆలయం :
ఈ పుణ్యక్షేత్రం నెల్లూరులో రాపూరు మండలంకి 35 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మధ్య పెనుశిల నరసింహస్వామి దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పెంచలస్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి చాలా మంది వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మే, ఏప్రిల్ మధ్యలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి ఇక్కడ. తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెంచలకోనకు కుడా స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు. కన్వ మహర్షి ఇక్కడ తపస్సు చేసారని అంటూఉంటారు. మాములు రోజుల్లో చీమ చిటుక్కన్నా వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది.
ప్రయాణ మార్గాలు
నెల్లూరు నుండి పొదలకురు, ఆదురుపల్లి మీదుగ (సుమారు 40కి.మీ) రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చును. ప్రతి 2:30 గంటలకు ఈ మార్గం లో బస్సు వసతి కలదు.

No comments:

Post a Comment