Thursday, 14 August 2014

ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం

ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం”(The World’s Largest Hindu Temple Ever-to-be-Built) ఎక్కడ నిర్మాణమౌతోందో ..? అది చూడటానికి ఎలా వుంటుందో.. ? ఇదిగో .. ఇక్కడ.. చదవి ‌..చూడండి ..!!
శ్రీవిరాట్ రామాయణ్ మందిర్గా పిలవబడే ఆలయం చారిత్రక పట్టణమైనవైశాలినుండి 60 కిలోమీటర్ల దూరంలో, బీహార్లో రాజధాని పాట్నా నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దీని ఖచ్చితమైనసంప్రదాయస్థానం” (exact location) ఉత్తర బీహార్లో, తూర్పు చంపారన్ జిల్లా Kathwalia-Bahuara గ్రామానికి సమీపంలో కేసరియా-చకియా(Chakia) రోడ్ సమీపంలోజానకి నగర్వద్ద సుమారు “200 ఎకరాలవిస్తీర్ణంలో నిర్మించ బడుతోంది.దీనినిపూర్తి చేసినప్పుడుఇది ప్రపంచంలోనేఅతి పెద్ద HinduTemple”గా అవుతుంది.
ప్రస్తుతం Cambodiaలో వున్న, ప్రపంచంలోని 12 శతాబ్దపు, అతిపెద్ద HinduTemple”ఆంగ్కోర్ వాట్ఆలయ “215 అడుగులఎత్తు కంటే ఎక్కువగా,ఈఆలయం “440 అడుగుల ఎత్తుకలిగి ఉంటుంది.
విరాట్ రామాయణ్ మందిర్” “అధికారిక నిర్మాణపొడవు “2268 అడుగులు”, వెడల్పు “1296 అడుగులుమరియు ఎత్తు “440 అడుగులుగా ఉంటుంది. మందిర సముదాయంలో “18 ఆలయాలుఉంటాయి.
సముదాయంలో వుండే శివాలయంలో ప్రపంచంలోనేఅతిపెద్ద శివలింగంకూడా ఉంటుంది.
ఆలయం పాట్నా లోనిమహావీర్ మందిర్ ట్రస్ట్చే నిర్మించబడుతోంది.
విరాట్ రామాయణ్ మందిరంలోసీతా, రామ, లవ, కుశ విగ్రహాలుతో పాటు, ప్రధాన ఆలయ ప్రాంగణం “20,000” మంది భక్తులు కూర్చునే సామర్థ్యం కలిగి ఉంటుంది.
ఆలయ పూర్తి నిర్మాణ అంచనా వ్యయం “500 కోట్లు”. మొత్తాన్ని భక్తుల నుండివిరాళాలరూపంలో అందుకుంటారు.
ఇప్పటికే ఆలయ నిర్మాణం కోసం 21 జూన్ 2012 , తూర్పు చంపారన్ జిల్లా Kathwalia-Bahuara గ్రామానికి సమీపంలో కేసరియా-చకియా(Chakia) రోడ్ సమీపజానకి నగర్వద్దభూమి -పూజను వేడుకను నిర్వహించారు.
ప్రతిపాదిత విరాట్ రామాయణ్ మందిరం యొక్కమోడల్ను 13 నవంబర్, 2013 పాట్నాలో ద్వారకా పీఠం శంకరాచార్యస్వామి స్వరూపానంద సరస్వతిసమక్షంలో ఆయన అనుగ్రహంతో, అప్పటి బిహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ ఆవిష్కరించారు.

ఇదిగో.. ఆలయచిత్ర విశేషాలను ఇక్కడ చూసి ఆనందిచండి.. పది మందితో పంచుకోండి..!!


No comments:

Post a Comment