Thursday 14 August, 2014

జనక్ పూర్”(ఉమాదేవి ) శక్తిపీఠం

శక్తిపీఠం, నేపాల్ దేశంలోనిజనక్ పూర్లో వుంది. !!
జనక్ పూర్పట్టణం, నేపాల్ లోని కాట్మాండు నుండి 135 km దూరంలోనిధనుషజిల్లాలో వుంది. ప్రాంతం దిగువ నేపాల్ గా కూడా పిలుస్తారు. జనక్ పూర్జనక్ పూర్ ధామ్గా (scared region) కూడా పిలివబడుతోంది. ఇదిఇండియా సరిహద్దునుండి కేవలం 20 కి.మీ. దూరంలో వుంది.!!
ఇక్కడ సతీ దేవివామ స్కందం” (వెడమ భుజం) (left shoulder) పడినదని నమ్ముతారు..!!
జనక్ పూర్”(ఉమాదేవి ) శక్తిపీఠం గురించిరెండుకధనాలు వినిపిస్తాయి.
ఒక కధనంప్రకారం జనక్ పూర్”(మిథిలాంచల్) “రామాయణంలోని శ్రీసీతా దేవిపుట్టినిల్లు. ఇది జనక్ పూర్ రైల్వే స్టేషన్ నుండి కేవలం 1 Km దూరంలో వుంది. చాలా మంది ఇక్కడ వున్న సుప్రసిద్ధజానకి మందిర్నే ఒకశక్తిపీఠంగా నమ్ముతారు. ఇక్కడ వున్న శ్రీసోనామాయి మందిర్పురాతన శక్తి ఆలయముగా భాసిస్తోంది. శ్రీ జనక మహారాజు ప్రాంతంలోని భూమినే దున్నుతుండగాసీతాదేవినిపొందినట్లు చెపుతారు.
ఇకరెండో కధనంప్రకారం, బీహార్ లో, మధుబనిజిల్లా డివిజన్, Benipatti Subdivion చెందిన “Ucchaith” గ్రామంలో వున్న “Uchaitha Durgasthan” (దేవి భగవతి)నేశక్తి పీఠంగా భావిస్తారు. Ucchaith గ్రామంకూడా, నేపాల్జనక్ పూర్నుండి కేవలం 30 Km దూరంలో ( సమీప రైలుస్టేషన్ కామ్తాల్ -24 K.m) ఉంది. దీనికిదర్భాంగానుండి కూడా బస్సులు వున్నాయి.
ఇది “Uchaith” లేదా “Uchaitha”స్థాన్ గా పిలవబడేదుర్గ మాతదేవాలయానికి ప్రసిద్ధి. గ్రామ స్థానిక భాషమైథిలీలో వుంటుంది. ఇదిమిథిలాంచల్యొక్క ప్రముఖ చారిత్రక స్థలాల్లో ఒకటిగా ఉంది.
నేపాల్లోమిథిల సంస్కృతికు వేల ఏళ్లనాటి చరిత్ర ఉంది. దానికిస్వంత భాష”(మైథిలి) మరియులిపికూడా ఉంది. ఎన్నో కావ్యాలు, కధలు మైథిలి భాషలో కూడా వ్రాయబడ్డాయి. ప్రశాంత ప్రాంతంలోని అధ్భుతమైనమిథిలా సంస్కృతిగురించి తెలుసుకోవడానికి భారతదేశం నుండి, నేపాల్ చుట్టూ వుండే హిందూ భక్తులే కాక, అనేక మంది విదేశీయులు సైతంజనక్ పూర్జీవనాన్ని గురించి తెలుసుకోవడానికి సందర్శింస్తూవుంటారు.
మొదటి సహస్రాబ్ది(BC) కు చెందినశతపథ బ్రాహ్మణచరిత్ర ఆధారంగామాధవ విదేహరాజు, తన గురువుగౌతమ రాహుగణనేతృత్వంలో మొదటసారిగా “Sadānirā (Gandaka)”నదిని దాటి,“మిధిలా నగరంరాజధాని గావిదేహరాజ్యం స్థాపించాడు. సంఘటనలు అన్నీ, “గౌతమ రాహుగణఅనేక శ్లోకాలతోఋగ్వేదంలో కూర్చబడి, ఋగ్వేద కాలానికి చెందివినవిగా గుర్తించబడినాయి.
దీనికి అదనంగా, ఇద్దరు గొప్ప మునులు, హిందూమత స్థాపకుడుగౌతమ బుద్ధుడు”, మరియు జైనమత “24, చివరి తీర్ధంకరఐనవర్ధమాన మహావీరలు మిథిలా/జనక పూర్ లోనేనివసించారని తెలపబడింది. ప్రాంతం అంతా మొదటి మిలీనియంలో భారతదేశ చరిత్ర కు ముఖ్య కేంద్రంగా ఉంది.
జనక్ పూర్ కు వున్నపూర్వ చరిత్రను పరిశీలిస్తే , 1657 లో బంగారం తో చేసిన ఒకసీతా దేవివిగ్రహం ఇక్కడే, మందిరం వున్న ప్రదేశంలోనే దొరికినదని, దాని నాధారంగాసీతాదేవిఇక్కడే నివసించిందని చెపుతారు.
పురాణ కధల ప్రకారం, “శూర్ కిషోర్ దాస్అనే సన్యాసిసీతారాములదేవత చిత్రాలను ప్రదేశంలోనే కనుగొన్నాడని చెపుతారు. నిజానికి శూర్ కిషోర్ దాస్” “ఆధునికజనక్ పూర్ నిర్మాత మరియు వ్యవస్థాపకుడు కూడా. పవిత్ర ప్రదేశంలోసీత ఉపాసన తత్వశాస్త్రం”(సీతా ఉపనిషత్తు) గురించి బోధించిన గొప్ప రచయిత మరియు ముని శ్రేష్టుడు. ఇక్కడి ప్రదేశంలోనే జనక మహారాజుశివ ధనుస్సుకుపూజలుచేశారని కూడా ఈయన పేర్కొన్నారు !!
ఇకఆధునిక చరిత్రఆధారంగా, జానకి మందిరంను మధ్య భారతదేశంకు చెందినతికమ్ ఘర్రాణి శ్రీ “Brisabhanu Kunwari” చే 1911లో 900,000 రూపాయల ఖర్చుతో నిర్మించబండినట్లు తెలుస్తోంది.దీనినే “Nau Lakha Mandir”గా కూడా పిలుస్తారు.
జనక్ పూర్ ను సందర్శించడానికి సెప్టెంబర్ నుండి మార్చి వరకు మంచి కాలం. కాలంలో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉండి,అనేక పండుగలు కూడా కాలంలోనే జరుగుతాయి.

ఇదండీ .. జనక్ పూర్ శక్తి పీఠం పూర్తి విశేషాలు . !! మీలో ఎవరైనా వెళ్లగలిగితే .. రెండు ప్రదేశాలు చూసి వస్తేపూర్తి శక్తిపీఠంచూసినవారు అవుతారు ! శుభం భూయాత్. !!



No comments:

Post a Comment