Thursday 14 August, 2014

“గుహ్యెశ్వరీ” శక్తిపీఠం

శ్రీగుహ్యెశ్వరీ/గుఃజేశ్వరి/గురేశ్వరి/మాహామాయదేవి మొదలైన పేర్లుగల శక్తిపీఠం నేపాల్ దేశంలో, కాట్మాండ్ పట్టణంలోనిబాగమతినది వడ్డున, “పశుపతినాథ్ దేవాలయందగ్గర వున్నది !!
గుహ్యెశ్వరిఅనగా-(గుహ్యరహస్య/రహస్యాంగ) – “ఈశ్వరిఅనగాదేవత”–“రహస్యాంగ దేవతఅని పూర్తి అర్దం..!
సతీదేవిరహస్యాంగమ్”(Private Part) -“రెండుప్రదేశాలలో పడిందని, “మొదటిభాగం(Outer Parts), అస్సాం రాష్ట్రంలోని, “గువాహాతి (గౌహతి) లోనికామాఖ్యదేవి ఆలయంవద్ద, “రెండోభాగం(Inner Parts) ప్రదేశంలో పడిందని ఇతిహాస కధనం..!
ఆలయం పూర్తిగాతాంత్రిక విద్యోపాసనకు సంబందించినది. “తాంత్రికులకుఅతి ముఖ్యమైనఉపాసనస్థలంగా చెపుతారు!!
ఈఆలయం విశేషం ఏమిటంటే, ఆలయ ప్రాంగణం లోనికిహిందూ ఏతరులకు” (అన్య మతస్తులకు) ప్రవేశం లేదు.!
పూర్వం ఆలయం ఒక చిన్నఖాళీ ప్రదేశంలోవుండేది. అక్కడే నివాసముండే కొంతమంది గ్రామస్తులు మొదటసారిగా దేవిని ఆరాధించటం ప్రారంభించారు. పరిణామ క్రమంలో భాగంగా, “రాజా ప్రతాప్ మల్ల” 17 శతాబ్దం ప్రారంభంలో(1653) ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించారు.
ఆలయంభూటాన్ దేశ సంస్కృతికి అనుగుణంగా వారిపగోడఆకారంలో నిర్మించబడి, చూపరులకు ఆకర్షించేదిగావుండకపోవటంఆశ్చర్యంగా వుంటుంది.!
ఐతే, ఆలయప్రధాన మందిరంపుష్పమాలలతో అందంగా అలంకరించి వుండి, చూడటానికి చాలా మనోహరంగా వుంటుంది..!
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే , ఇక్కడ ఆలయంలో వివాహం జరుపుకున్న జంటలు, మరో “ 6 జన్మలు పాటుఅదేసహచర-జంట”(same couple) లుగాపునర్జన్మలుఎత్తుతారని ఇక్కడి ప్రజల ప్రఘాడ నమ్మకం !
ఆలయంలో జరిగేనవరాత్రి పండుగ సందర్భంగా నేపాల్ రాజు , అతని కుటుంబ సభ్యులు కలిసిభాగమతినదిలో పవిత్ర స్నానం చేసి పూజించే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది !!

పెళ్ళైన వారు, తమ భర్తల ఆరోగ్యం కోసం ఇక్కడి దేవిని పూజిస్తూవుంటారు !! అలాగేశత్రు-విజయంకోసం కూడా ప్రార్ధనలను చేస్తువుంటారు.!!

No comments:

Post a Comment